చంద్రబోస్ గుండెలు పిండేసిన 'కలయా నిజమా'

‘ విక్రమ్’ చిత్రంలోని ” కలయా నిజమా.” అంటూ సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ విడుదలచేశారు.నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం విక్రమ్‌.హీరో నాగవర్మ సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది.

 Vikram Movie Song Lunch By Writer Chandra Bos-TeluguStop.com

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదలకు సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబోస్ చేతుల మీదుగా కలయా నిజమా అనే పాటను విడుదల చేశారు.

పాట విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబోస్ మాట్లాడుతూ “కలయా నిజమా… అనే పల్లవితో సాగే ఈ పాటలో రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని పొందుపరిచారు.చిత్రంలో సందర్భాను సారంగా వచ్చే విషాదభరిత ఈ పాట గుండెలను పిండేశాలా ఆకట్టుకుంటోంది.

హీరో నాగవర్మ తన హావభావాలతో పాటను రక్తికట్టించారు.సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రాణం పోశాయి.

సినిమా విజయవంతం కావాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని అన్నారు.

చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ, “చిత్రంలో అద్భుతమైన సాహిత్యం కలిగిన ఈ పాటను చంద్రబోస్ గారు ఆవిష్కరించడం ఎనలేని ఆనందంగా ఉంది.

ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి.ఏ పాటకు ఆ పాట పోటాపోటీగా అలరింపజేస్తాయి.

సమష్టి కృషితో చిత్రం చాలా బాగా వచ్చింది.అక్టోబర్లో అనుకూలమైన మంచి డేట్ చూసుకుని చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

 దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ,”సంగీతభరిత ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మేళవించి కొత్తపంధాలో ఈ చిత్రాన్ని మలిచాం.విక్రమ్ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సమాజానికి దగ్గరగా… మనం నిత్యం చూసే వ్యక్తుల పాత్రలు మాదిరిగా సహజంగా ఉంటాయి.

తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏం చేశాడు అన్నది ఆసక్తికరంగా చెప్పాం” అని అన్నారు.

#Naga Vamshi #Vikram #Chandra Bos

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు