వీడియో: జలపాతంలోకి దూకిన యువతి... కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?

ఈరోజుల్లో చిన్నపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్( Smart phones ) వాడేస్తున్నారు.అవి లేకుండా వారు అసలు ఉండటం లేదు.

 Video The Young Woman Who Jumped Into The Waterfall Would You Pick Your Nose If-TeluguStop.com

మారం చేస్తూ తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు.మందలిస్తే ఏదైనా చేసుకోవడానికి అయినా తెగిస్తున్నారు.

అంతగా వారు ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక యువతి తల్లిదండ్రులు ఫోన్ విషయంలో మందలించారని ఆత్మహత్యాయత్నం చేసింది.

వివరాల్లోకి వెళితే.ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో( Bastar, Chhattisgarh ) 21 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.ఆమె నివాసానికి చిత్రకోట్ వాటర్ ఫాల్స్ అనే జలపాతం దగ్గరగానే ఉంటుంది.ఈ జలపాతాన్ని “మినీ నయాగరా జలపాతం”( Mini Niagara Falls ) అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది దాదాపు 300 మీటర్ల వెడల్పుగా ఉంటుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో ఈ జలపాతం ఒక ప్రళయంగా మారుతుంది.ప్రస్తుతం ఇండియాలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ జలపాతం చాలా డేంజరస్‌గా మారింది.

సరిగ్గా ఇదే సమయంలో ఓ రోజు సదరు యువతి మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తోందని తల్లిదండ్రులు ఆమెను మందలించారు.దాంతో ఆ అమ్మాయి కలత చెందింది.మరుసటి రోజు ఆమె స్వయంగా చిత్రకోట్ జలపాతాలకు వెళ్ళింది.

సమీపంలోనే ఉన్న కొందరు ఆమెను గమనించి జలపాతం అంచుకు వెళ్లి చూశారు.వారు దూకవద్దని చెప్పినా ఆమె వినకుండా జలపాతంలోకి దూకింది.

అక్కడే ఉన్న కొందరు యువకులు ఈ తతంగమంతా తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆశ్చర్యకరంగా ఆ యువతి చాలా ఎత్తు పైనుంచి దూకినా ప్రాణాలతో బయటపడి కింద నీటిలో తెలుతూ కనిపించింది.జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈ యువతి దూకినట్లు వారు గుర్తించారు.

తరువాత వారు ఆమెను ఆమె కుటుంబానికి తిరిగి ఇచ్చారు.దాంతో పెద్ద ప్రమాదం తప్పింది.

నిజంగా ఆమె అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరని ఈ విషయం తెలిసినవారు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube