తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ లో, ప్రెస్ మీట్ లలో ఎక్కడ చూసినా కూడా మనకు సురేష్ కొండేటి( Suresh Kondeti ) అనే ఒక వ్యక్తి కచ్చితంగా కనిపిస్తూ ఉంటారు.సురేష్ కొండేటి పై సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయో మనందరికీ తెలిసిందే.
సినిమా ప్రమోషన్స్ సమయంలో అతను వేసే పిచ్చి పిచ్చి ప్రశ్నల గురించి సోషల్ మీడియాలో చర్చించుకోవడంతో పాటు ఆయా హీరోల అభిమానులు దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేస్తూ ఉంటారు.ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసిన అతడు తన బుద్ధిని వరుసను మాత్రం మార్చుకోడు.
కొన్ని సార్లు కావాలనే ఏదో ఫేమస్ అవ్వాలని, ట్రెండ్ అవ్వాలని, గెలికి మరీ ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది.తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్‌ను( Varalaxmi Sarath Kumar ) కూడా అలానే ఒక ప్రశ్న అడిగాడు.ఇక్కడి వాళ్లు అయితే రివర్స్‌లో నిలదీయకుండా వదిలేస్తుంటారు.కానీ సిద్దార్థ్, వరలక్ష్మీ వంటి వారు మాత్రం అస్సలు వదలరు.మొన్న సిద్దార్థ్( Siddharth ) అయితే అనాల్సిందంతా అనేశాడు.ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చాడు.
కానీ చివర్లో బిస్కెట్ వేసినట్టుగా కవర్ చేశాడు.ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్‌కు చిక్కాడు సురేష్ కొండేటి.
ఓంకార్ తీసిన మ్యాన్షన్ 24( Mansion 24 ) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది.ఈ మ్యాన్షన్ 24లోనూ అలాంటి ఒక నేపథ్యమే ఉండేలా కనిపిస్తోంది.
అయితే దేవుళ్లు, దెయ్యాల మీద నమ్మకం ఉందా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగితే.ఉందంటూ సమాధానం ఇచ్చింది వరలక్ష్మీ.ఆ రెండింట్లో ఏది అంటే ఇష్టమని సురేష్ కొండేటి అడిగాడు.అలా ఎవరైనా అడుగుతారా? ఇదీ ఓ ప్రశ్నేనా? మీకు ఏమైనా దెయ్యాలు అంటే ఇష్టమా? అని సురేష్ కొండేటిని నవ్వుతూ నిలదీసింది.రాత్రి సమయంలో షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్లే టైంలో, పడుకునే టైంలో ఏమైనా భయం వేసిందా? అంటూ మరో ప్రశ్న వేశాడు సురేష్ కొండేటి.తాను సెట్‌లో చేసింది సెట్‌లోనే వదిలేసి వెళ్తాను అని మళ్లీ దాని గురించి ఆలోచించే టైపు కాదని, తాను భయపడలేదని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.