తెలుగు సినీ ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వరలక్ష్మి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarathkumar ).మరి ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది వరలక్ష్మి శరత్ కుమార్.ఈ సినిమా తరువాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.
ఈ సినిమా తర్వాత ఈమె పలు సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.ఎటువంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటి వరలక్ష్మి శరత్ కుమార్.ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.తెలుగులో ఈమె క్రాక్, వీర సింహారెడ్డి, యశోద,కోటబొమ్మాలి పిఎస్ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి మెప్పించింది.
ఇది ఇలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా నటించిన చిత్రం హనుమాన్( Hanuman movie ).తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో అంజమ్మ అనే పాత్ర చేసింది వరలక్ష్మీ.
ఈ పాత్ర తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని, ఈమధ్య అన్నీ విలనీ టచ్ వున్న పాత్రలు చేస్తున్న తనకు ఇదొక కొత్త తరహ పాత్ర అవుతుందని చెప్పుకొచ్చింది.అలాగే సలార్ సినిమాలో శ్రియా రెడ్డి చేసిన పాత్రకు మొదట వరలక్ష్మీని సంప్రదించారని గతంలో వార్తలు వచ్చాయి.దీని గురించి వరలక్ష్మీ దగ్గర ప్రస్తావించగా ఆ విషయంపై వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ.
ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం.
ఆయనకి పెద్ద ఫ్యాన్ ని.కలసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. సలార్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు.
అదంతా రూమర్.వస్తే ఆ ఛాన్స్ ఎందుకు వదులుకుంటా? అని క్లారిటీ ఇచ్చింది వరలక్ష్మీ.కాగా ప్రశాంత్ వర్మ( Prashant Varma ) దర్శకత్వం వహించిన హనుమాన్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.