వరలక్ష్మి శరత్ కుమార్.( Varalakshmi Sarath Kumar ) తండ్రిని మించిన తనయగా ఆమె అన్ని భాషల్లో బాగానే రాణిస్తుంది.
హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉన్నప్పటికి అది నెరవేరక పోవడం తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ విలన్ గా వయసుకు మించిన పరిణితి తో నటిస్తూ బాగానే డబ్బులు కూడబెట్టుకుంటుంది.అయితే ఇటీవల ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వరలక్ష్మి కుండ బద్దలు కొట్టినట్టు సమాదానాలు చెప్పారు.
ఎప్పుడు పెళ్లి ( Varalakshmi Sarath Kumar Marriage ) చేసుకుంటారు అని యాంకర్ ప్రశ్నించగా ఆమె చాల భిన్నంగా స్పందించారు.అస్సలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి .పెళ్లి చేసుకొని రోజు ఒక్కడి మొహమే చూస్తూ ఉండాలి.రాజకీయాల్లోకి రావాలని నా లక్ష్యం.
ప్రేమ లేని పెళ్ళిలో అర్ధం లేదు.ప్రేమించకుండా కూడా పెళ్లి చేసుకోలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
దీనికి యాంకర్ ఒకింత షాక్ కి గురై పెళ్లి విషయంలో మీరు చాల పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసారు అంటూ అనడం తో అందుకు బదులుగా ఎవరి బలవంతం మీద ఒక వ్యక్తి తో జీవింతాంతం కలిసి ఉండలేవు.ప్రేమించి జీవితాంతం ఆ వ్యక్తి తో ఉండాలి అని నిర్ణయించుకుంటేనే పెళ్లి చేసుకోవాలి.సల్మాన్ ఖాన్( Salman Khan ) లాంటి హీరో ని పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని ఎవరైనా ప్రశ్నించగలరా ? ఆడవాళ్లకే ఎందుకు ఇన్ని ప్రశ్నలు.ఆడవాళ్లు సైతం వారి కోసం వారు బ్రతకగలరు.
సంపాదించుకోగలరు.అలాగే వారికే ఏం కావలి వారు చేసుకోగలరు ఖర్చు కూడా పెట్టుకోగలరు.
ఎవరి పైన ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు.
అంతే కాదు ఆమె తన జీవితంలో ప్రేమలో పడటం, అతడితోనే బ్రతకాలని అనుకోవడం అది జరగకుండా పోవడం వంటి అన్ని జరిగిపోయాయి.అందుకే పెళ్లి విషయం లో ఆమెఇంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేసారు.అయితే ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆమె పై ఎన్నో ట్రోల్స్ రావచ్చు.
అలాగే ఆమె క్యారెక్టర్ ని కూడా నిందించచ్చు.కానీ ఆమె మాట్లాడుతున్న దాంట్లో చాల మట్టుకు నిజాలే ఉన్నాయ్ .కానీ వాటిని అంగీకరించడం లో మాత్రం మన ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం.ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో ఎంజాయ్ చేసే ఈ లోకం లో నిజాయితీ గా మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి.