శ్రీమంతులు కావాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు   Vaastu Tips For Getting Money     2017-11-02   22:00:38  IST  Raghu V

మనలో చాలా మంది వాస్తును నమ్ముతారు. అలాగే వాస్తు ప్రకారం కూడా మంచి జరుగుతుందని అందరు భావిస్తారు. శ్రీమంతులు కావాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇంట్లో ప్రధాన ద్వారం ముందు వైర్లు వంటివి ఏమి అడ్డు పెట్టకుండా ఉంటే సంపద బాగా వృద్ధి చెందుతుంది.

ఉత్తరం, తూర్పు ప్రదేశాలలో బీరువా ఉంచితే సంపాదించినా ధనం నిలవదు. ఎదో విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అందువల్ల ఆ దిక్కులలో బీరువా పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మి దేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళదు.

ఉత్తరం, తూర్పు ప్రదేశాలలో వాటర్ ట్యాంక్ ఉంటే సంపద పెరుగుతుంది. అలాగే ఇంటిలో ఉత్తరం, తూర్పు ప్రదేశాలలో ఎక్వేరియం పెట్టిన మంచిదే.

పనిచేయని గడియారం ఇంటిలో ఉంటే ధన నష్టం కలుగుతుంది. అందువల్ల పనికిరాని గడియారం ఉంటే వెంటనే బయట పాడేయండి.

ఇంటికి ప్రధాన ద్వారం ఇంటి చివర ఉంటే ఆర్ధికంగా ఎదగటం కష్టం అవుతుంది.

డబ్బు ఉంచే లాకర్ దక్షణ గోడకు పెట్టి, ఉతరం వైపు ఓపెన్ చేసేలా ఉంటై డబ్బు బాగా పెరుగుతుంది.

ఈస్ట్ లేదా నార్త్ లో డ్రైనేజ్ పైపులు ఉండాలి. వీటిని పాటిస్తే సంపదతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది.