యూపీఎస్సీ పరీక్షలో అరుదైన ఘనత.. భార్యభర్తలిద్దరూ సివిల్స్ లో ర్యాంక్ సాధించడంతో?

సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరు యూపీఎస్సీ పరీక్షలో( UPSC Exams ) విజేతగా నిలవడమే కష్టమనే సంగతి తెలిసిందే.భార్యభర్తలిద్దరూ సివిల్స్ లో ర్యాంక్ సాధించడం అరుదుగా మాత్రమే జరుగుతుంది.

 Upsc Young Couple Success Story Detils Here Goes Viral In Social Media Details H-TeluguStop.com

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలలో కేరళ చెందిన భార్యభర్తలిద్దరూ ర్యాంకులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.కేరళ రాష్ట్రానికి చెందిన మాళవిక 172వ ర్యాంక్ సాధించగా భర్త నంద గోపన్ 233వ ర్యాంక్ సాధించారు.

Telugu Kerala, Malavika Nair, Nanda Gopan, Story, Upsc, Young-Inspirational Stor

మాళవిక(Malavika G Nair) ఐదో ప్రయత్నంలో ఈ ర్యాంక్ ను సొంతం చేసుకోగా నంద గోపన్ చివరి ప్రయత్నంలో ఈ ర్యాంక్ సాధించారు.బిట్స్ గోవాలో చదువుకునే సమయంలోనే మాళవిక ఐ.ఆర్.ఎస్ గా ఎంపై ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ విభాగంలో సహాయ కమిషనర్ గా పని చేస్తున్నారు.మాళవిక తల్లి గైనకాలజిస్ట్ గా పని చేస్తుండగా తండ్రి కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో డీజీఎంగా పని చేసి రిటైర్ కావడం గమనార్హం.
నంద గోపన్( Nanda Gopan ) విషయానికి వస్తే నందగోపన్ తల్లి ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ డాక్టర్ కాగా తండ్రి ఐఓబీలో చీఫ్ మేనేజర్ గా పని చేసి రిటైర్ కావడం గమనార్హం.

నందగోపన్ విషయానికి వస్తే ప్రస్తుతం పథనంథిట్ట జిల్లాలో మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ లో పని చేస్తున్నారు.మాళవిక సోషియాలజీని ఆప్షనల్ గా ఎంచుకోగా నందగోపన్ మలయాళం లిటరేచర్ ను ఆప్షన్ గా ఎంచుకున్నారు.

Telugu Kerala, Malavika Nair, Nanda Gopan, Story, Upsc, Young-Inspirational Stor

ఒకే కుటుంబంలోని భార్యాభర్తలు( Young Couple ) మంచి ర్యాంక్ సాధించడంతో ఇరు కుటుంబాల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మాళవిక, నందగోపన్ సక్సెస్ స్టోరీ( Success Story ) ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.ఎంతో కష్టపడటం వల్లే తమకు ఈ ర్యాంక్ లు వచ్చాయని వాళ్లు చెబుతున్నారు.మాళవిక, నంద గోపన్ తమ సక్సెస్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలవడంతో పాటు ప్రశంసలను అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube