Upasana Ramcharan : ప్రతి మహిళ విజయం వెనక అలాంటి వ్యక్తి ఉంటారు.. ఉపాసన పోస్టు వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్( Ramcharan )ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఒకవైపు వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే.

 Upasana Latest Post Viral On Social Media-TeluguStop.com

ఇక ఈయన ఉపాసనని ( Upasana ) ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత ఉపాసన కూడా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు చేరుస్తూ వచ్చారు.

ఇలా మెగా కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకోవడమే కాకుండా మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ మెగా కుటుంబానికి మరింత పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తున్నారు.ఇకపోతే ఉపాసన రాంచరణ్ దాంపత్య జీవితం ఎంతో మందికి ఆదర్శంగా ఉందని చెప్పాలి.

వీరిద్దరూ ఆదర్శ దంపతులుగా నిలిచారు ఇకపోతే ఇటీవల ఉపాసన రాంచరణ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ వీరిద్దరి దాంపత్య జీవితం గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఫోర్బ్స్ మ్యాగజైన్(Forbes magzine)కవర్ పేజీపై వీరిద్దరి ఫోటో వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ మ్యాగజైన్ కవర్ పేజీ గురించి తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది ఇందులో భాగంగా ఉపాసన ఈ ఫోటోని షేర్ చేస్తూ ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందన్న విషయం గురించి నాకు తెలియదు.కానీ ప్రతి మహిళ విజయం వెనుక మాత్రం ఒక సపోర్ట్ చేసే వ్యక్తి ఆ మహిళకు సెక్యూర్ చేసే వ్యక్తి ఉంటారని భావిస్తాను అంటూ తన భర్త గొప్పతనం గురించి ఈమె తెలియజేశారు.

పెళ్లి తర్వాత తన విజయానికి అలాగే ఏ విషయంలోనైనా ముందుకు అడుగు వేయడానికి రామ్ చరణ్ సపోర్ట్ తనకు ఎంతో ఉందని అలాగే తన విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త పడుతూ తనకు సెక్యూరిటీ కల్పిస్తారు అంటూ ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు.ఇలా తన భర్త గురించి ఈమె చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఈ పోస్ట్ చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఉపాసన రాంచరణ్ కు తగ్గ భార్య అంటూ మరోసారి అభిమానులు ఈమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే ఉపాసన రాంచరణ్ దంపతులు పెళ్లైనటువంటి 11 సంవత్సరాలు కు తల్లిదండ్రులుగా మారారు.ప్రస్తుతం ఈ దంపతులకు క్లిన్ కారా ( Klin Kaara ) అనే కుమార్తె జన్మించారు.ప్రస్తుతం ఉపాసన తల్లిగా ఒక వైపు తన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూనే మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కూడా దూసుకుపోతున్నారు.ఇక బుల్లి మెగా వారసురాలిని చూడటం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఉపాసన తన కూతురి ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube