హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య.. కెనడాలోనే నిందితులు , త్వరలోనే అరెస్ట్ చేస్తామంటోన్న పోలీసులు

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Prime Minister Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి.ఈ నేపథ్యంలో కెనడాలోని ఖలిస్తాన్ గ్రూపులు, సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 Canada Police Soon To Arrest Accused In Hardeep Nijjar Killing Case , Hardeep Ni-TeluguStop.com

నిజ్జర్ హత్య వెనుక భారత్ కుట్ర వుందంటూ ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.దీనికి భారత్ సైతం ధీటుగా బదులివ్వడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Telugu Canada, Hardeep Nijjar, Khalistan, Primejustin, Royal Canadian, Globe Mai

నిజ్జర్ హత్యను సీరియస్‌గా తీసుకున్న కెనడా దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారణ జరుపుతున్నాయి.అతనిని కాల్చి చంపిన ఇద్దరు వ్యక్తులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.కొద్దిరోజుల్లోనే వారిని అదుపులోకి తీసుకుంటారని ది గ్లోబ్ అండ్ మెయిల్( The Globe and Mail ) నివేదించింది.సర్రేలో నిజ్జర్‌ను కాల్చి చంపిన తర్వాత అనుమానిత వ్యక్తులు కెనడాను వీడి వెళ్లలేదని, నెలల తరబడి పోలీసుల నిఘాలోనే వున్నారని కెనడియన్ మీడియా నివేదిక పేర్కొంది.

గ్లోబ్ అండ్ మెయిల్ అనేది కెనడియన్ వార్తాపత్రిక.ఇది పశ్చిమ , సెంట్రల్ కెనడాలోని ఐదు నగరాల్లో ముద్రించబడుతుంది.అంతేకాదు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు కూడా రాబోయే వారాల్లో వారిని అరెస్ట్ చేసి అభియోగాలు మోపాలని కసరత్తు చేస్తున్నట్లుగా ది గ్లోబ్ అండ్ మెయిల్ నివేదించింది.

Telugu Canada, Hardeep Nijjar, Khalistan, Primejustin, Royal Canadian, Globe Mai

జూన్ 18న కెనడాలోని సర్రేలో వున్న ఓ గురుద్వారా వెలుప హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు .మరోవైపు.భారత్‌లో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు, కెనడాలో జరుగుతున్న హత్యలకు గ్యాంగ్‌వారే ప్రధాన కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.ఈ కోవలోనే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగి వుండొచ్చని కొందరి అంచనా.

కెనడా ప్రభుత్వం చేపడుతున్న దర్యాప్తులో నిజ్జర్ హత్య వెనుక అసలు దోషులెవరో తేలనుంది.అటు భారత్ కూడా తన ప్రమేయం లేదు అనడానికి తగిన ఆధారాలను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టాల్సి వుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube