సెల్వ రాఘవన్… తమిళనాట దర్శకుడుగా విభిన్నమైన సినిమాలు తీసే క్రియేటర్ గా ఈయనకు మంచి పేరుంది.చాలామంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.
కానీ అభిమానుల మనసులో నిలిచే సినిమాలను తీసిన వాడే గొప్ప దర్శకుడు అవుతాడు అలాంటి గొప్ప దర్శకులులలో సెల్వ రాఘవన్ పేరు ముందు వరుసలో ఉంటుంది.ఒక సినిమా అంటే ఏ కేవలం సాహిత్యం మాత్రమే కాదు అంతకు మించిన అద్భుతమైన మరియు ప్రభావమైన ఒక కళారూపం.
అందుకే ఈ మధ్యకాలంలో భాషతో ఎటువంటి సంబంధం లేకుండా అనేక సినిమాలను చూడటం వాటిని ఆస్వాదించడం వ్యాపకం గా చేసుకున్నారు సినీ ప్రేమికులు.
ఇక సెల్వ రాఘవన్ విషయానికొస్తే ఈయన మనిషిలోని అనేక రకాల ఎమోషన్స్ ని చక్కగా తెరపై చూపించగలడు.ప్రేమ కామం అసూయ వంటి ఎంతో సున్నితమైన అంశాలను అలాగే మనస్సు వెనక ఉన్న చీకటిని కూడా అంతే అందంగా చూపించగల ఒక అద్భుతమైన దర్శకుడు సెల్వ రాఘవన్.సెల్వ రాఘవన్ తీసిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క భిన్నమైన చిత్రాలు.
ధనుష్ లాంటి హీరోను స్టార్ హీరోగా మార్చడంలో సెల్వ పాత్ర కచ్చితంగా ఉంది ఆయన తీసిన పుదుపుటై అనే సినిమా తెలుగులో దూల్ పెట్ విడుదల అయింది.ఇక Mr.కార్తీక్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాలు ఎంతో చక్కగా ఉంటాయి.అంతేకాదు కార్తీ ని పరిచయం చేస్తూ యుగానికి ఒక్కడు వంటి ఒక వైవిధ్య భరితమైన సినిమా తీయడం కూడా సెల్వ రాఘవన్ కి మాత్రమే సాధ్యమైంది ఇలాంటి ఒక సినిమా తీయాలంటే అది మామూలు దర్శకులకు సాధ్యం కాదు.
సెల్వ రాఘవన్ తీసిన ప్రతి సినిమాకి సీక్వల్ ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అంతగా ఆయనది ఒక ప్రత్యేకమైన పంథా, విభిన్నమైన శైలి.ఈయన దర్శకత్వం లో ఒక మంచి సినిమా వచ్చి చాలా రోజులు అయింది.మళ్ళీ మునుపటి మాదిరి సినిమాలు మళ్ళీ తీయాలని అందరూ కోరుకుంటున్నారు.ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తె సెల్వ రాఘవన్ కి బార్య గీతాంజలి రామన్ మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నటి సోనియా అగర్వాల్ తో మొదటి పెళ్లి మరియు విడాకుల తర్వాత ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నారు.