ఆస్కార్‌ బరిలో మరో అరవ సినిమా.. మనకు మరింత సిగ్గుచేటు

ఆస్కార్ అవార్డులు ఇండియన్ సినిమాకు అందని ద్రాక్ష అన్నట్లుగా ఉంది.అవార్డుల సంగతి అలా ఉంచితే కనీసం హిందీ మరియు తమిళం ఇంకా మలయాళం సినిమా లు ఆస్కార్‌ అవార్డుల నామినేషన్ కు ఎంపిక అవుతున్నాయి.

 Two Tamil Movies In Next Year Oscar Race , Flim News, Oscar Awards, Tamil Flim I-TeluguStop.com

నామినేషన్ కు పంపించేందుకు కూడా తెలుగు సినిమా లు ఒక్కటి అంటే ఒక్కటి కూడా అర్హత సాధించడం లేదు.తెలుగు లో వందల కోట్ల సినిమా లు ప్రతి ఏడాది చాలానే వస్తున్నాయి కాని ఏ ఒక్కటి కూడా ఆస్కార్‌ ముందు వరకు వెళ్లడం లేదు.

తమిళం నుండి ఇప్పటికే మండేలా సినిమా ను ఆస్కార్‌ నామినేషన్స్ కు పంపించేందుకు సిద్దం అయ్యారు.తాజాగా మరో సినిమా ను కూడా ఆస్కార్‌ నామినేషన్స్ కు పంపించేందుకు గాను జ్యూరీ మెంబర్స్ ఓకే చెప్పారు.

ఆస్కార్‌ బరిలో సినిమాలు నిలిచాయి అంటే అదో గొప్ప విజయం అన్నట్లుగానే చెప్పుకుంటూ ఉంటారు.

తాజాగా ఆ అరుదైన గౌరవంను తమిళ సినిమా కూజాంగల్ కూడా దక్కించుకుంది.

విఘ్నేష్‌ శివన్ మరియు నయనతారలు కలిసి నిర్మించిన ఈ సినిమా కు ఆస్కార్‌ ఎంట్రీ దక్కడం అదృష్టం అంటూ తమిళ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కమర్షియల్‌ గా ఆలోచించకుండా ఈ రియల్‌ జంట ఆస్కార్‌ రేంజ్ సినిమాను నిర్మించడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారీ అంచనాల నడుమ ఆస్కార్‌ ఎంట్రీలను జ్యూరీ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కు ఆ అవకాశం దక్కింది.విఘ్నేష్‌ శివన్ చాలా సంతోషంగా ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ కు ఎంపిక అయ్యిందని పేర్కొన్నాడు.

ఆ సినిమా ఆస్కార్ ను దక్కించుకోవాలంటే మరో రెండు అడుగులు మాత్రమే ఉంది.ఫైనల్‌ నామినేషన్‌ కు సెలక్ట్ అవ్వాలి.

అక్కడ నామినేట్‌ అయిన సినిమాల్లో ఒక సినిమా గా ఆస్కార్‌ ను అందుకోవాలి.అక్కడి వరకు ఈ సినిమా వెళ్లినా వెళ్లకున్నా ఇదో గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.

రెండు తమిళ సినిమాల ఉ ఎంట్రీ దక్కించుకున్నాయి.కాని తెలుగు సినిమాలు మాత్రం కనిపించడం లేదు.

ఇది టాలీవుడ్‌ కు సిగ్గు చేటు అనడంలో సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube