ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ.. లాట‌రీ ప‌ద్ధ‌తిలో అమ్మాయి ఎంపిక‌.. ఇన్ని ట్విస్టులా..

లవ్ స్టోరీలో ట్విస్టులు అంటే కేవలం సినిమాల్లోనే ఉంటాయనుకుంటే మీరు పొరపడినట్లే తాజాగా ఓ రియల్ లవ్ స్టోరీలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నట్లు బయటకు వచ్చింది.ఇటీవల కాలంలో ఓ యువకుడు అక్కా చెల్లెళ్లను మ్యారేజ్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

 Triangle Love Story .. Girl Selection In Lottery Style .. So Many Twists .., Tri-TeluguStop.com

తాజాగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మాత్రం బోలెడన్ని ట్విస్టులు ఉన్నాయండోయ్ ఇంతకీ ఆ ట్విస్టులెంటి ఆ మ్యారేజ్ ఎక్కడ జరిగిందంటే.సినిమాను తలదన్నే స్థాయిలో ఈ లవ్ స్టోరీ సీన్ ఉండగా, ఈ సంఘటన కర్నాటక స్టేట్‌లో జరిగింది.

స్థినికుల వివరాల ప్రకారం కర్నాటక రాష్ట్రం హాసన జిల్లా సకలేశపుర గ్రామానికి చెందిన యువకుడు సోషల్ మీడియా వేదికగా ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు.అయితే, ఇంతకాలం అతడు ఒక యువతికి తెలియుకుండా మరొక యువతితో తన ప్రేమాయణం జరిపాడు.

అయితే, తాజాగా ఇరువురు యువతులకు ఈ విషయం తెలిసింది.అయితే, ఇక్కడే ఓ ట్విస్టుంది.ఇద్దరు అమ్మాయిలను ప్రేమించినట్లు యువకుడు తెలిపినప్పటికీ ఆ ఇద్దరు యువతులూ సదరు అబ్బాయి కావాలని పట్టుబట్టారు.అతడు లేకుండా తమ జీవితమే ఉండబోదని తేల్చిచెప్పారు.

దాంతో ఆ ఇద్దరు యువతులలో ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలో ఆ యువకుడికి అర్థం కాక తల పట్టుకున్నాడు.గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు ఈ విషయం తెలిపాడు.

ఈ క్రమంలోనే ఓ అమ్మాయి తాను యువకుడు లేకుండా ఉండలేనంటూ విషం తాగింది.ఆమెను ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ ఇవ్వగా ప్రస్తుతం ఆమె హెల్త్ బానే ఉంది.

ఇక ఆమె తిరిగొచ్చాక ఈ విషయమై మళ్లీ పంచాయితీ పెట్టారు పెద్దలు.

Telugu Lottory, Love Story, Marrege, Trianglelove-Latest News - Telugu

ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇష్యూను సాల్వ్ చేసేందుకుగాను గ్రామ పెద్దలు ఓ మార్గం తెలిపారు.అదేంటంటే.లాటరీ ద్వారా ఎంపిక.

లాటరీలో ఎవరి పేరు వస్తే వారు ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలి.రానీ వారు ఎటువంటి ఫిర్యాదు చేయకుండా ఉండాలని కండిషన్స్ పెట్టారు.

ఇందుకు సదరు ఇద్దరు యువతులు ఓకే చెప్పగా, లాటరీ తీశారు.అయితే, అనూహ్యంగా లాటరీలో విషం తాగిన యువతి పేరు రాగా, ఆ అమ్మాయి సదరు యువకుడిని మ్యారేజ్ చేసుకుంది.

ఇక లాటరీలో పేరు రాని యువత నూతన జంటకు శుభాకాంక్షలు తెలపింది.కానీ, ఈ నేపథ్యంలోనే తనను మోసగించిన యువకుడిని అంత ఈజీగా / వదలబోనంటూ హెచ్చరిస్తు వెనుదిరగింది.

కాగా, ఈ మ్యారేజ్ మ్యాటర్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్థానికంగా చర్చనీయాంశమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube