Trainman APP: బంపర్ ఆఫర్ అంటే ఇదే... ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఫ్లైట్‌ జర్నీ ఫ్రీ అంట?

ఏంటి ఆశ్చర్యంగా వుందా? మీరు విన్నది నిజమే.అత్యవసర సమయాల్లో ట్రైన్‌ టికెట్‌ బెర్తు ఒకవేళ కన్ఫం కాకపోతే ప్రయాణికుల కోసం ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ అయినటువంటి ‘ట్రైన్‌మ్యాన్’ ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

 Trainman App Offers Free Flight Ticket If Train Ticket Not Confirmed Details, Tr-TeluguStop.com

ఈ ఫీచర్‌ సాయంతో కన్ఫామైన ట్రైన్‌ టికెట్‌లను సొంతం చేసుకోవడమే కాకుండా అవి కూడా లేని యెడల ఆయా రూట్లలో విమాన సదుపాయం ఉంటే ఫ్రీగా ఫ్లైట్‌ టికెట్‌లను అందిస్తామని ప్రకటించడం కొసమెరుపు.ట్రైన్‌ మ్యాన్ యాప్ ‘ట్రిప్ అస్యూరెన్స్’ అనే కొత్త ఫీచర్‌ను తాజాగా డెవలప్‌ చేసి సంచలం సృష్టించింది.

ఈ క్రమంలోనే రైల్వే ప్రయాణీకులకు, సీట్లు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటే వారికి టికెట్లను కన్ఫం చేసి ఇస్తామని హామీ ఇచ్చింది.యాప్ టికెట్‌ కన్ఫం అయ్యే అవకాశాలను ప్రిడిక్షన్ మీటర్‌లో చూడవచ్చు.

ఒకవేళ చార్ట్ తయారీకి ముందు టికెట్‌లు కన్ఫం కాని యెడల ట్రిప్ అస్యూరెన్స్ ఫీచర్‌ సాయంతో చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ట్రైన్‌ రూట్లు, టికెట్‌ సదుపాయాల్ని చూసుకొని బుక్ చేసుకోవడంలో ప్రయాణికులకు సహాయం చేస్తుంది.అయితే ఇక్కడ కొన్ని నియమనిబంధనలు ఉంటాయి.ప్రయాణీకుల టిక్కెట్ ప్రిడిక్షన్ మీటర్‌లో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ అని సూచిస్తే, యాప్ ట్రిప్ అస్యూరెన్స్ రుసుము రూ.1 వసూలు చేస్తుంది.

Telugu Journey, Ticket, Irctc, Train, Train Ticket, Trainman App-Latest News - T

90 శాతం కంటే తక్కువగా ఉంటే మాత్రం టికెట్ తరగతిని బట్టి నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తారు.ఐడియా సూపర్ కదూ.ముఖ్యంగా, చార్ట్ ప్రిపరేషన్ సమయంలో రైలు టికెట్ కన్ఫం అయినట్లయితే ఆ రుసుము కస్టమర్‌లకు రీఫండ్ కూడా చేయబడుతుంది.టికెట్ బుక్‌ కాని యెడల ప్రయాణికులకు ఉచితంగా ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌చేస్తామని ట్రైన్‌ మ్యాన్‌ వ్యవస్థాపకుడు CEO అయినటువంటి వినీత్ చిరానియా స్వయంగా వెల్లడించారు.

ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్ ప్రస్తుతం అన్ని IRCT రాజధాని రైళ్లలో, దాదాపు 130 ఇతర రైళ్లలో సేవల్ని అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube