మ‌నిషి మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌వుతున్న‌ టాప్‌-10 ప్ర‌మాద‌క‌ర జీవులివే!

ప్రపంచంలోని ఏ జంతువులు మానవుల మరణానికి కారణమవుతున్నాయి? ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.మొద‌ట‌ సింహం గురించి మాట్లాడుకుందాం.

 Top 10 Dangerous Creatures That Cause The Death Of 10 Man Danger Animals Forest-TeluguStop.com

సింహాలు ప్రతి సంవత్సరం సుమారు 200 మందిని చంపుతుంటాయి.అయితే సింహాల కంటే మనుషులను చంపే జంతువులు కొన్ని ఉన్నాయి.

మానవులను చంపే జాబితాలో హిప్పోపొటామస్‌లు తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి.వీటి వల్ల ఏటా 500 మంది మరణిస్తున్నారు.

ఏనుగులు ప్రతి సంవత్సరం సగటున 600 మందిని చంపుతాయి.మానవులకు అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఎలిగేటర్లు ఏడవ స్థానంలో ఉన్నాయి.

సగటున ఎలిగేటర్లు ప్రతి సంవత్సరం సుమారు 1,000 మందిని చంపుతాయి.

తేలు కుట్టడం వల్ల ఏటా సగటున 3,300 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ప‌లు క‌ట‌కాలు ఏటా సగటున 10,000 మంది మరణానికి కారణమవుతున్నాయి.కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం సగటున 59 వేల మంది మరణిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం 1,38,000 మంది మరణిస్తున్నారు.మ‌నుషుల‌ అత్య‌ధిక మరణాలకు దోమలే కారణం.దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం సగటున 7,25,000 మంది మరణిస్తున్నారు.దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, మెదడువాపు మొద‌లైన‌ వ్యాధులు వస్తాయి.

Top Most Poisonous and Dangerous Animals

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube