తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్( Katrina Kaif ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
ఈమె తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.తెలుగులో వెంకటేష్ తో మల్లీశ్వరి, బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలు చేసింది.
ఇక తెలుగులో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్( Bollywood ) కి చెక్కేసింది.అక్కడ వరుసగా అవకాశాలు రావడంతో పాటు స్టార్ హీరోయిన్గా మారడంతో టాలీవుడ్ వైపు మళ్లీ తొంగి చూసింది లేదు.
అయితే కత్రినా తెలుగు సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఒక స్టార్ హీరో ఆమె దగ్గర ఐదు కోట్ల అప్పు తీసుకొని ఎగ్గొట్టేశాడట.
కత్రినా టాలీవుడ్ హీరోలతో నటిస్తున్న సమయంలోనే ఒకే స్టార్ హీరో నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటున్నట్లు ఆమెతో చెప్పడంతో పాటు 5 కోట్ల రూపాయలను అప్పుగా కూడా ఆమె దగ్గర తీసుకున్నాడట.కానీ సినిమా తీసిన తరువాత అది ప్లాప్ కావడంతో ఆ హీరో కత్రినాకి ఇవ్వాల్సిన డబ్బులు గురించి ఏం మాట్లాడలేదట.అంతేకాకుండా రెండు మూడు సార్లు కత్రినా ఆ వ్యక్తిని డబ్బులు గురించి అడిగితే అసలు నువ్వు నాకు ఎప్పుడూ డబ్బు ఇచ్చావని ఎదురు తిరిగాడంట.
దీంతో కత్రినా ఇక మీదట ఎవరినీ నమ్మకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వార్తపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కాగా కత్రినా కైఫ్ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.మరొకవైపు విక్కీ కౌశల్ కూడా వరుసగా సినిమాలలో అలాగే కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.