తెలంగాణలో కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు.ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్తారని నారాయణ తెలిపారు.ఈ క్రమంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందన్న ఆయన అహంభావం ఓడిపోతుందని వెల్లడించారు.
అదే అహంకారంతో ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు.బీఆర్ఎస్ పై యూత్, దళితుల్లో వ్యతిరేకత ఉందని తెలిపారు.
కొత్తగూడెంలో సీపీఎం శ్రేణులు సహకరించాయని వెల్లడించారు.అయితే వృద్ధులు ఓటు వేసినా యువత ఓటు వేయలేదని తెలిపారు.