టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఇవే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్ల హవా కొనసాగుతోంది.క్రేజ్, సక్సెస్ లో ఉన్న హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.

 Tollywood Star Heroines  Movie Offers Details List, Shruti Haasan, Konda Polam,-TeluguStop.com

సక్సెస్ లో ఉన్న హీరోయిన్లకు అవకాశం ఇస్తే సినిమాలకు ఆ హీరోయిన్లు బిజినెస్ పరంగా హెల్ప్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.లాక్ డౌన్ తర్వాత హీరోలు ఏ స్థాయిలో బిజీ అయ్యారో హీరోయిన్లు సైతం అదే స్థాయిలో బిజీ కావడం గమనార్హం.

హీరోలు రెండేళ్లకు ఒక సినిమాను రిలీజ్ చేస్తుంటే హీరోయిన్లు మాత్రం అదే సమయంలో 4 నుంచి 5 సినిమాలను పూర్తి చేస్తున్నారు.గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే ఖాతాలో ఇండస్ట్రీ హిట్ చేరింది.

తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య, రాధేశ్యామ్ షూటింగ్ లను పూర్తి చేసిన పూజా హెగ్డే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో హీరోయిన్ గా ఎంపికయ్యారు.

బాలీవుడ్ లో రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ సినిమాల్లో, తమిళంలో విజయ్ కు జోడీగా ఒక సినిమాలో పూజా హెగ్డే కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Telugu Keerthy Suresh, Konda Polam, Krithi Shetty, Mehreen, Offers, Rashi Khanna

టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు, పుష్ప సినిమాలలో నటిస్తున్నారు.మిషన్ మజ్ను, గుడ్ బై పేర్లతో తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి.ఒకే ఒక్క సినిమా సక్సెస్ తో ఉప్పెన బ్యూటీ కృతి రామ్ లింగుస్వామి మూవీలో, బంగార్రాజు మూవీలో, నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీలో, శ్యామ్ సింగరాయ్ మూవీలో, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు.

Telugu Keerthy Suresh, Konda Polam, Krithi Shetty, Mehreen, Offers, Rashi Khanna

తెలుగులో మరే హీరోయిన్ చేతిలో కృతిశెట్టి స్థాయిలో ఆఫర్లు లేవు.రాశీఖన్నా తెలుగులో పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలతో బిజీగా ఉండగా మలయాళంలో, తమిళంలో కూడా ఈ బ్యూటీ చేతిలో సినిమాలు ఉన్నాయి.మిల్కీ బ్యూటీ తమన్నా సీటీమార్, మ్యాస్ట్రో సినిమాలను పూర్తి చేయగా ఎఫ్3, గుర్తుందా శీతాకాలం వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ మంచి రోజులు వచ్చాయి, ఎఫ్3 సినిమాలతో బిజీగా ఉన్నారు.

Telugu Keerthy Suresh, Konda Polam, Krithi Shetty, Mehreen, Offers, Rashi Khanna

రకుల్ నటించిన కొండపొలం రిలీజ్ కు సిద్ధంగా ఉండగా తమిళ, హిందీ భాషల్లో రకుల్ చేతిలో 6 సినిమాలు ఉన్నాయి.టాలీవుడ్ లో నిదానంగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా పేరున్న శృతిహాసన్ ప్రస్తుతం సలార్ సినిమాలో మాత్రమే నటిస్తున్నారు.కీర్తి సురేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా ఆమె నటించిన గుడ్ లక్ సఖి రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube