డ్యూటీ మానేసి టిక్ టాక్ వీడియోలతో బిజీ అయిన నర్సులు...షోకాజ్ నోటీసులు  

Tiktok Of Nurses In Odisha Hospital Go Viral-telugu Viral News Updates,tiktok Of Nurses,viral In Social Media,viral In Tiktok,టిక్ టాక్ వీడియో,షోకాజ్ నోటీసులు

ఇప్పుడు టిక్ టాక్ గురించి తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రతి ఒక్కరూ కూడా టిక్ టాక్ లో ఎదో ఒక వీడియో చేయడం అప్ లోడ్ చేయడం ఇదే పని అయిపొయింది. అయితే ఈ టిక్ టాక్ కారణంగా కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు,మరికొందరు ఉద్యోగాలను కూడా పోగొట్టుకొనే పరిస్థితులు ఎదురవుతున్నాయి..

డ్యూటీ మానేసి టిక్ టాక్ వీడియోలతో బిజీ అయిన నర్సులు...షోకాజ్ నోటీసులు -TikTok Videos Of Nurses In Odisha Hospital Go Viral

ఒడిశా లోని ఓ ఆసుపత్రిలో నర్సులు ఈ టిక్ టాక్ వీడియో ల కారణంగా ఉద్యోగాలకే ఎసరు వచ్చిన పని అయ్యింది. ఇటీవల వాళ్ళు చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. మల్కన్ గిరి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే నర్సులు, పసిపిల్లల వార్డులో విధులకు కేటాయించారు.

అయితే వారు చేయాల్సిన పనులను పక్కన పెట్టి టిక్ టాక్ లో కాలక్షేపం చేస్తున్నారు. పసిబిడ్డలను ఎత్తుకుని ముద్దు పెడుతూ, బాలీవుడ్‌ పాటలకు లిప్‌ మూమెంట్‌ ఇస్తూ, ఫన్నీ డైలాగులు చెబుతూ టిక్‌టాక్‌లో వీడియోలు రికార్డు చేసి అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలోకి ఎక్కడంతో ఇప్పుడు పెద్ద రచ్చ రచ్చ అవుతుంది. నందినీ రే, రూబీ రే, తపసీ బిస్వాన్‌, జ్యోతి రే అనే నర్సుల ఉద్యోగాలకే ఇప్పుడు ఎసరొచ్చి పడింది.

వారి వీడియోలను చూసిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పనులు చేయకుండా ఈ విధంగా టిక్ టాక్ వీడియోలు తీసుకుంటూ కాలక్షేపం చేయడం ఏంటి అని ఆ నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

అయితే ఈ ఘటనపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ తెలిపారు. ఒకవేళ అవసరమైతే వారిని విధుల నుంచి తొలగిస్తామని కూడా వారు తెలిపారు.