వైరల్..గ్రామంలో అవమానించారని అడవికి వెళ్ళాడు..17 ఏళ్లుగా అక్కడే..!

తన గ్రామంలో తనకు అవమానం జరిగిందని ఒక వ్యక్తి అవమాన భారంతో ఆ ఊరు ఒదిలి వెళ్లి పోయాడు.తనతో పాటు తనకు ఇష్టమైన కారును తీసుకుని అడవికి వెళ్ళాడు.

 This Karnataka Man Has Lived In His Ambassador Car Parked In Deep Forest For 17-TeluguStop.com

ఆ కారులోనే 17 సంవత్సరాలుగా ఉంటున్నాడు.అడవిలో ఒంటరిగా ఉంటున్న విషయం బయటకు రావడంతో ఈ విషయం కాస్త వైరల్ అయ్యింది.

అసలు విషయం మొత్తం తెలియాలంటే పూర్తి వివరాలు తెలుసు కోవాల్సిందే.

కర్ణాటక రాష్ట్రానికి చెంసిన నెక్రల్ అనే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవించేవాడు.

అయితే 2003 లో తన భూమిని తాకట్టు పెట్టి బ్యాంకులో ఋణం తీసుకున్నాడు.పంటలు సరిగా పండక అతడు తీసుకున్న ప్పును తిరిగి చెల్లించలేక పోయాడు.దీంతో బ్యాంక్ అధికారులు అతడి పొలాన్ని వేలం వేసి డబ్బులు తీసుకున్నారు.

Telugu Ambassador Car, Forest, Karnataka, Karnatakalived-Latest News - Telugu

దీంతో తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి చంద్రశేఖర్ ఇంకా ఆ గ్రామంలో ఉండలేక పోయాడు.దీనిని అవమానంగా భావించి అతడు గ్రామంలో ఉండలేక వెళ్లిపోవాలని అనుకున్నాడు.అతు వెళ్ళిపోతూ తనకు ఎంతో ఇష్టమైన తన కారును కూడా తీసుకుని స్వగ్రామం విడిచి తన సోదరి ఇంటికి వెళ్ళాడు.

అక్కడ ఒక సంవత్సరం ఉన్న తర్వాత తన సోదరితో విభేదాలు రావడం వల్ల ఇక అతడికి ఉండబుద్ధి అవ్వలేదు.

Telugu Ambassador Car, Forest, Karnataka, Karnatakalived-Latest News - Telugu

అక్కడ నుండి తన కారులో బయల్దేరి 15 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఒక అడవి కనిపించడంతో అక్కడికి వెళ్ళాడు.ఇక ఆ అడవిలోనే అప్పటి నుండి ఒంటరిగా ఉండిపోయాడు.అక్కడ దొరికే ఆహారాలను తింటూ పక్కనే కాలువలో నీళ్లు తాగుతూ తన కారులోనే కాపురం పెట్టేసాడు.

ఆ తర్వాత చిన్న గుడిసె వేసుకుని బుట్టలు అల్లుకుంటూ వాటి ద్వారా వచ్చిన డబ్బుతో జీవితం సాగిస్తున్నాడు.

గత 17 సంవత్సరాల నుండి అడవిలోనే జీవిస్తూ ఉండడంతో ఈ విషయం అక్కడి అధికారులకు తెలిసి వారు అక్కడికి చేరుకొని నచ్చజెప్పి పంపించాలని చుసిన వెళ్లకుండా అక్కడే ఉన్నాడు.

చివరకు కలెక్టర్ వచ్చి చెప్పిన వినలేదు.ఇక్కడే బాగుందని గ్రామానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు.

తాజాగా ఈ విషయం మీడియాలో రావడంతో వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube