ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఆ అవమానం తప్పలేదు.. కేజిఎఫ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో రవీనాటాండన్ ఒకరు.ఈమె ఎన్నో సినిమాలలో నటించిన ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉన్నారు.

 They Insulted Me During Pregnancy Raveen Tandon Shocking Comments Details, Kgf-TeluguStop.com

ఈ విధంగా టీవీ షోలలో చేస్తూనే కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తాజాగా ఈమె కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాలో మంత్రి రమికా సేన్ గా పవర్ ఫుల్ పాత్రలో నటించారు.

ఇకపోతే ప్రస్తుతం సౌత్ సినిమాలు నార్త్ లో మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీ సినిమాల గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో కామెంట్స్ వినిపించాయి.

ఈ క్రమంలోనే సౌత్ సినిమాలలో అత్యధిక బడ్జెట్ తప్ప ఇంకేమీ ఉండదు అంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు కామెంట్లు చేశారు.

తాజాగా ఈ కామెంట్లపై రవీనాటాండన్ స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సౌత్ జనాలకు సినిమాలంటే ఎంతో ప్రేమ అందుకే ఎక్కువ డబ్బు ఖర్చు చేసి సినిమాలు చేస్తున్నారని ఈమె క్లారిటీ ఇచ్చారు.అదే విధంగా గతంలో తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి కూడా ఈ సందర్భంగా రవీనాటాండన్ తెలియజేశారు.

సాధారణంగా ప్రెగ్నెంట్ సమయంలో చాలామంది బరువు పెరగడం సర్వసాధారణం.తాను కూడా ప్రెగ్నెన్సీ సమయంలో అధిక శరీర బరువు పెరిగానని ఈమె చెప్పుకొచ్చారు.

Telugu Bollywood, Insults, Kgf Chapter, Kgf, Rammika Sen, Raveena Tandon, Raveen

డెలివరీ తర్వాత ఎన్నో వర్క్ ఔట్ చేసి తాను కూడా బరువు తగ్గానని, అప్పటికే నా బాడీ షేమింగ్ గురించి ఎన్నో కామెంట్లు వచ్చాయని తెలిపారు.ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ మీరు శరీర బరువు పెరగడం వల్లే కదలకుండా కూర్చోవడం కోసం టీవీ షోలను ఎంపిక చేసుకున్నారా అని అడిగారు.దాంతో నేను వర్కౌట్ చేసి చాలా సన్నబడితే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావ్ అనిప్రశ్నించాను అంటూ రవీనాటాండన్ ఈ సందర్భంగా గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube