ఒక సినిమాని ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీయాలంటే దర్శకుడు దానిమీద చాలా కసరత్తులు చేయవలిసి ఉంటుంది.ముందుగా ఆ సినిమాకు సంబంధించిన స్టోరీని అద్భుతంగా రాసుకొని ఆ తర్వాత అప్పుడు ఆ సినిమాని డైరెక్షన్ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకోవడానికి మంచి సినిమాలను చేస్తూ ఉంటారు.ఇక ఈ క్రమంలోనే తెలుగు నుంచి సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) డిఫరెంట్ కథలనే ఎంచుకుంటూ ముందుకు కదులుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే సందీప్ వంగ మంచి దర్శకుడిగా గుర్తింపు పొందుతున్నాడు.అలాగే ఆయన సినిమాల వల్ల ఇండస్ట్రీలో కూడా చాలావరకు సూపర్ సక్సెస్ లు వస్తున్నాయనే చెప్పాలి… ఇక ఆయన తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కూడా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నాడు.
అందుకే ఆయనతో ఎక్కువ మంది హీరోలు సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.ప్రస్తుతం ఈయన ఎన్టీఆర్ తో ( NTR ) సినిమా చేస్తున్నాడు.
ఇక రీసెంట్ గా ప్రభాస్ ని హీరోగా పెట్టి చేసిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది.ఈ సినిమా దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టింది.ఇక ఇండియాలోనే సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది…ఇక వీళ్ళతో పాటు తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) కూడా తన మార్పు స్టామినాని చూపిస్తూ ముందుకు కదులుతున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.
ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో లోకేష్ ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే పాన్ ఇండియాలో ఈ ముగ్గురు దర్శకుల మీద ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్లు కూడా ముందుకు వస్తున్నారు.
అలాగే అభిమానులు కూడా వీళ్ళ సినిమాలను చూడటానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు…
.