పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ స్పందించారు.తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.
పార్టీ మారుతున్నానని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోందని మాజీ ఎంపీ వివేక్ చెప్పారు.ఈ క్రమంలో పార్టీని వీడే ఆలోచన లేదని, వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని తెలిపారు.
కొందరు కుట్ర పూరితంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన అంశం కూడా తనకు తెలియదని తెలిపారు.