కారు నంబర్ ప్లేట్‌లోని డిజిట్స్‌తో రూ.40 లక్షల లాటరీ గెలిచిన యువతి!

ఒక్కోసారి మనకు చెందిన ప్రాపర్టీ లేదా వస్తువులే రేపు మనల్ని అదృష్టవంతులని చేస్తుంటాయి.తాము కొనుగోలు చేసిన భూమిలోనే గుప్త నిధులు దొరికి కోటీశ్వరులు అయిన ప్రజలు ఎందరో ఉన్నారు.

 The Young Woman Who Won The Lottery Of Rs. 40 Lakh With The Digits Of The Car Nu-TeluguStop.com

అయితే తాజాగా ఒక మహిళ తన లైసెన్స్ ప్లేట్ నంబర్‌ కారణంగా ఒక్కరోజులోనే లక్షాధికారి అయింది.నంబర్‌ ప్లేట్‌తో లక్షాధికారి అవ్వడం ఎలా అనే కదా మీ సందేహం.

అయితే ఆమె స్టోరీ మీరు తెలుసుకోవాల్సిందే.

అమెరికాలోని మేరీల్యాండ్‌లో నివసిస్తున్న ఒక 43 ఏళ్ల మహిళ కొద్ది రోజుల క్రితం బాల్టిమోర్‌లోని ఫుడ్ స్టాప్ మినీ మార్ట్‌లో నిర్వహిస్తున్న ఒక లాటరీ పోటీలో పాల్గొనాలనుకుంది.

అయితే ఏ నంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేయాలో ఆమెకు తెలియలేదు.“పిక్ 5” అని పిలిచే ఈ లాటరీ టికెట్స్ 5 అంకెలతో ఉంటాయి.

ఆ డిజిట్స్ ఎలా డిసైడ్ చేయాలో ఆమె బాగా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది.అదేంటంటే ఆమె తన పాత కారు లైసెన్స్ ప్లేట్ నంబర్‌లోని అంకెలను వాడాలనుకుంది.

అలాగే చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చివరికి 50,000 డాలర్ల (దాదాపు రూ.40 లక్షలు) లాటరీ ప్రైజ్ గెలుచుకుంది.

ఈ లాటరీ టికెట్‌ను ఆమె కేవలం ఒక డాలర్ (సుమారు రూ.80)తో కొనుగోలు చేసింది.ఆ టిక్కెట్‌లోని మొత్తం ఐదు నంబర్లు డ్రా విన్ అయిన టికెట్‌తో మ్యాచ్ అయ్యాయని తెలుసుకున్నప్పుడు ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైంది.50,000 డాలర్ల జాక్‌పాట్ లేదా రూ.39.85 లక్షలు తనకు వస్తున్నాయని తాను ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని ఆమె సంతోషంగా చెబుతోంది.

“నాకు నిజంగా లాటరీ తగిలిందని నేను మొదటిలో నమ్మలేకపోయాను” అని ఆమె చెప్పుకొచ్చింది.ఈ అదృష్టాన్ని మరొకసారి నిర్ధారించుకునేందుకు తన టిక్కెట్‌ను రెండుసార్లు చెక్‌ కూడా చేసుకుందట.అలాగే తన తల్లి చేత కూడా చెక్ చేయించి ఆమె నిజమే అని చెప్పిన తర్వాత తాను ఈ శుభ సంఘటనను సెలబ్రేట్ చేసుకుందట.

ఈ డబ్బులతో కొన్ని బిల్లులు చెల్లించడానికి, కొత్త కారుకు కొన్ని రిపేర్లు చేయించడానికి.అలానే తన ముగ్గురు పిల్లలు, ఒక మనుమడికి వైద్య ఖర్చులకు ఉపయోగిస్తానని ఆమె చెబుతోంది.

అయితే ఆమె లాటరీ గెలుచుకున్న తీరు గురించి తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube