ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. జబర్దస్త్ ను భారీగా దెబ్బ కొట్టిన స్టార్ మా?

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో సీజన్ 6 గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో యంగ్ జనరేషన్ కంటెస్టెంట్లను ఎక్కువగా ఎంపిక చేయడం గమనార్హం.

 Star Maa Channel Huge Shock To Jabardast Show Details Here Goes Viral , Star Ma-TeluguStop.com

అయితే జబర్దస్త్ ప్రోగ్రామ్ ను స్టార్ మా గట్టి దెబ్బ కొట్టిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఎంతోమంది పాపులర్ కమెడియన్లు ఇప్పటికే వేర్వేరు కారణాల వల్ల జబర్దస్త్ షోకు దూరమైన సంగతి తెలిసిందే.

అయితే బిగ్ బాస్ షోకు స్టార్ మా చలాకీ చంటి, ఫైమాలను ఎంపిక చేయడంతో జబర్దస్త్ కు గట్టి దెబ్బే అని చెప్పవచ్చు.బిగ్ బాస్ నిర్వాహకులతో ఉన్న ఒప్పందం ప్రకారం ఈ ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా స్టార్ మా ఛానల్ లోని ప్రోగ్రామ్స్ కు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

Telugu Biggboss, Chalaki Chanti, Faima, Jabardast Show, Jabardasth, Nagarjuna, M

ఈ కారణం వల్ల రాబోయే రోజుల్లో కూడా చలాకీ చంటి, ఫైమాలను జబర్దస్త్ లో చూడటం సులువు కాదు.మరోవైపు చలాకీ చంటి, ఫైమా టాలెంటెడ్ కమెడియన్లు అనే సంగతి తెలిసిందే.వీళ్లతో కలిసి ఏదైనా కామెడీ ప్రోగ్రామ్ ను స్టార్ మా ప్లాన్ చేసినా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.స్టార్ మా వీళ్లిద్దరినీ ఎంచుకోవడం ద్వారా అటు జబర్దస్త్ ను దెబ్బ తీయడంతో పాటు స్టార్ మా రేటింగ్ ను పెంచుకుంటోంది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా స్టార్ మా అదిరిపోయే ప్లాన్ వేసిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రోజురోజుకు కమెడియన్ల సంఖ్య తగ్గుతుండటంతో జబర్దస్త్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సుధీర్, హైపర్ ఆది దూరంగా ఉండటంతో ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రేటింగ్స్ తగ్గాయనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube