ముంబై విమానాశ్రయంలో(Mumbai Airport) ఇటీవల చోటుచేసుకున్న సంఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.ఓ మహిళ విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకోవడంపై క్యాబ్ డ్రైవర్‌ను (cab driver)దుర్భాషలాడుతూ దాడి చేసిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
విమానం మిస్(Missed the plane) అయినందుకు క్యాబ్ డ్రైవర్‌ను బాధ్యుడిగా చూపిస్తూ ఆమె ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.అసలేమీ జరిగిందన్న విషయానికి వస్తే.
మహిళా విమానం మిస్ అయిన తర్వాత డ్రైవర్‌ను చితకబాదడం మొదలుపెట్టింది.విమానాశ్రయానికి ఆలస్యంగా చేరడానికి క్యాబ్ డ్రైవర్ కారణమని మహిళా తెలిసింది.
అయితే, ఆమె ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం.ఈ నేపథ్యంలో ఆమె చర్యలు పూర్తిగా అనుచితమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియోలో మహిళ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ, అతడిపై దాడి చేస్తూ కనిపిస్తోంది.ఇది చూసిన నెటిజన్లు ఆమె చర్యలను తీవ్రంగా ఖండించారు.వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు బాధిత డ్రైవర్‌కు పలు సూచనలు చేశారు.
వెంటనే సదరు మహిళపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.అలాగే మహిళ తన తప్పును డ్రైవర్‌పైకి నెట్టడం అర్థరహితం అని అన్నారు.
ముఖ్యంగా మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై స్పందించిన కొందరు ట్రాఫిక్ అధికారులు మహిళే ఆలస్యానికి కారణమని నిర్ధారించడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసులను కోరారు.డ్రైవర్‌పై ఈ విధంగా దాడి చేయడం నిరాశాజనకమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు అవసరమని సోషల్ మీడియా నెటిజన్స్ అభిప్రాయపడ్డారు.ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.
మానవత్వం, సహనంతో వ్యవహరించడం అవసరమని ఈ ఘటన మనకు పాఠం చెబుతోంది.క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ న్యాయం అందించాలని నెటిజన్లు కోరుతున్నారు.