కొంతమంది జీవితాంతం ఉద్యోగాలు చేసుకుంటూ ఏ కొత్త అనుభూతులను ఆస్వాదించలేరు.కొందరు మాత్రం ధైర్యం చేసి సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభిస్తారు.
టెన్నెస్సీలోని మెంఫిస్‌కు చెందిన ఓ జంట ఈ కోవ కిందికే వస్తారు.ఆ దంపతుల పేర్లు మోనికా బ్రజోస్కా, జోరెల్ కాన్లీ.
వీరు సాధారణ జీవితాన్ని వదిలి క్రూయిజ్ షిప్లో( cruise ship ) శాశ్వతంగా నివసించాలని ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు.ఇంటికి బదులుగా, వారు ఓడను తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు.
ఆస్తులను విక్రయించి, ఉద్యోగాలను వదిలి, ఈ జంట కొత్త సాహసానికి అడుగుపెట్టింది.క్రూయిజ్‌లో ఉన్న సమయంలో వారు స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తారు.స్పాలో చికిత్సలు తీసుకోవడం, ఓడ అందించే అద్భుతమైన వంటకాలను ఆస్వాదించడం వారి డైలీ రొటీన్.మాజీ ఉపాధ్యాయురాలు అయిన మోనికా( Monica ) ఇప్పుడు సిబ్బంది తమ అవసరాలన్నీ చూసుకుంటున్నందున ఆమె వంట, లాండ్రీ వంటి పనుల నుంచి విముక్తి పొందింది.
ఈ విలాసవంతమైన జీవనశైలిని ఆమె ఎంతగానో ఆస్వాదిస్తుంది.
క్రూయిజ్ షిప్లో జీవించడం చాలా ఖరీదైనది కదా అనే డౌట్ చాలామందికి వస్తుంది.కానీ మోనికా, జోరెల్( Monica, Zorrell ), 10,000 డాలర్ల కంటే తక్కువ వార్షిక ఖర్చుతో ఈ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు.ఇంత తక్కువ ఖర్చు కావడానికి వారు క్రూయిజ్‌లపై డీల్‌ల కోసం వెతుకుతారు.
మెంఫిస్‌లోని ( Memphis )వారి ఇంటిని అద్దెకు ఇస్తారు.తక్కువ ఖర్చుతో కూడిన గదులను ఎంచుకుంటారు.
సవాళ్లు కూడా వారికి ఉన్నాయి.ముఖ్యంగా ఈ జంట కుటుంబం, స్నేహితుల నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది.
నిరంతరం ప్రయాణిస్తుండటం వల్ల ఒకే చోట స్థిరపడలేకపోవడం మరో సవాల్.అయితే వ్యక్తిగత సంక్షోభం వారికి ఒక పాఠం నేర్పింది.
అదేంటంటే జీవితాన్ని వాయిదా వేయవద్దు.వారి కలలను నెరవేర్చుకోవడానికి, 8 నెలల పాటు ఓడలో తిరుగుతూ, పొదుపు ఖర్చుతో జీవించాలని నిర్ణయించుకున్నారు.
ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుండి, మోనికా, జోరెల్ ఫిజీ, జపాన్, గ్రీస్‌తో సహా అనేక దేశాలకు వెళ్లారు.గత సంవత్సరంలో, వారు 36 బ్యాక్-టు-బ్యాక్ క్రూయిజ్లలో ప్రయాణించారు.