ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలోనే అతి పెద్ద పండుగ లలో హోలీ పండుగ ( Holi Festival )కూడా ఒకటి.రంగుల పండుగ హోలీని ఘనంగా జరుపుకోవడానికి ఈ దేశ వ్యాప్తంగా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ సంప్రదాయ పండుగ హోలీ ఉత్సవం మార్కెట్లో ఇప్పటికే మొదలైంది.హోలీని రంగులు ఆనందం ఉత్సాహ భరితమైన పండుగగా పిలుస్తారు.
హోలీ పండుగను పరస్పర ప్రేమ, సోదర భావాన్ని పెంచేందుకు వేడుకగా జరుపుకుంటారు.మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
హోలీలో వినోదం రంగులతో పాటు హోలికా దహన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
ప్రతి చోటా రంగుల హోలీకి ఒకరోజు ముందు మధ్యాహ్నం హోలికా పూజ, సాయంత్రం హోళికా దహనం చేస్తారు.హోలికను కాల్చడానికి కట్టెలు ఆవు పేడను సేకరించి ప్రధాన కూడళ్ల వద్ద దహనం చేస్తారు.అయితే ఒక చోట మాత్రం హోలికను కట్టేలతో కాకుండా కొబ్బరి కాయలతో కాలుస్తారు.
ఈ సంప్రదాయం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.రాజస్థాన్ లోని ఉదయపూర్ ( Udaipur )లో ఇలాంటి విభిన్నమైన శైలి ఉంటుంది.
దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హోలీ పండుగను మనదే శంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు.
హోలీ వేడుకలు వివిధ రూపాలలో, వివిధ ప్రదేశాలలో జరుపుతారు.ఉదయపూర్ లోని సెమరీలోని కర్కెలా ధామ్‌లో కొబ్బరి హోలీ చాలా కాలంగా ప్రజలను ఆకర్షిస్తూ ఉంది.
కర్కెలా ధామ్ లో కొబ్బరికాయలతో హోలీ ఆడే సంప్రదాయం ఉంది.బాబోయ్ కొబ్బరికాయలతో హోలీ ఏంటి అని భయపడకండి.కొబ్బరికాయలతో హోలీ అంటే ఒకరిపై ఒకరు కొబ్బరికాయలు కొట్టుకుని హోలీ ఆడరు.ఇక్కడి ప్రజలు హోలీకాకు కొబ్బరికాలను సమర్పించి హోలీ నీ జరుపుకుంటారు.ఉదయపూర్ లోని సెమ్రీ పట్టణంలోని ధంకవాడ గ్రామపంచాయతీ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కెలా ధామ్ గిరిజనుల పవిత్రమైన ప్రదేశంగా పిలుస్తారు.ఇక్కడి గిరిజనులు హోలీ కను తమ కూతురు అని నమ్ముతారు.
అందుకే హోలీ నీ ముందుగా కర్కెలా ధామ్‌లో మాత్రమే జరుపుకోవాలని ఒక నమ్మకం కూడా ఉంది.
ఆదివాసుల పవిత్ర ప్రదేశం కర్కెలా ధామ్‌లో హోలీ కాను మొదట వెలిగిస్తారు.
ఇక్కడ ప్రజలు హోలీ దహన్ తర్వాత ఎగిసిపడుతున్న మంటలను చూసిన తర్వాతే చుట్టుపక్కల హోలీ కాను కాలుస్తారు.కర్కెలా ధామ్ ఎత్తైన కొండపై ఉన్నందున హోలికా దహన్ దూరం నుంచి కూడా కనిపిస్తుంది.
ఆ తర్వాత మాత్రమే పరిసర ప్రాంతాలలో హోలీని జరుపుకుంటారు.తలపై కొబ్బరికాయను మోసుకొచ్చి ఇక్కడి అగ్నిలో వేస్తే వారి జీవితంలో అన్నీ కష్టాలు బాధలు తొలగిపోతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
DEVOTIONAL