వెంబడించి లారీని పట్టుకున్న పోలీసులు...రేషన్ బియ్యం తరలిస్తున్న వైనం

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ( DSP Rajasekhar Raju )ఆదేశాల మేరకు రూరల్ సీఐ కె.

వీరబాబు పర్యవేక్షణలో శుక్రవారం 12 గంటల సమయంలో వాడపల్లి ఎస్‌ఐ ఇ.

రవి తన సిబ్బందితో కలసి నల్లగొండ జిల్లా దామరచర్ల గ్రామ శివారులోని జాన్ పహాడ్ వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు.ఆ సమయంలో సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ వైపు నుండ్ ఏపీ వైపుకు ఏపీ 24వై 6788 నెంబర్ గల లారీ వెళుతుండగా ఆపేందుకు ప్రయత్నం చేయగా ఆపకుండా వేగంగా వెళ్ళడంతో దానిని వెంబడించి కృష్ణానది బ్రిడ్జ్ దగ్గరలో పట్టుబడి చేసి తనిఖీ చేయగా సుమారు 22 టన్నుల పిడిఎస్ రైస్ గుర్తించారు.

The Police Chased The Lorry And Caught It... It Was Transporting Ration Rice ,p

లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తాను ఏపీకి చెందిన కొంతమంది తో కలసి పిడిఎస్ రైస్ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు అంగీకరించడంతో లోడు లారీని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు శనివారం వాడపల్లి ఇ.రవి తెలిపారు.వెంబడించి అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న పోలీసులను డిఎస్పీ అభినందించారు.

ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్
Advertisement

Latest Nalgonda News