దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లను నిలుపుకోవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించేందుకు నిత్యం అదిరిపోయే ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.ఇందులో భాగంగా తాజాగా వాట్సాప్ iOS యూజర్ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ అనే కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసింది.
ఈ ఫీచర్‌ను కొత్త అప్‌డేట్‌లో విడుదల చేసింది.ఇంతకుముందు బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది కాగా ఇప్పుడు స్టేబుల్ వెర్షన్ వాడుతున్న యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి వచ్చింది.
ఈ మోడ్ కాల్‌కు అంతరాయం కలిగించకుండా వీడియో కాల్ సమయంలో మల్టీ టాస్క్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో వివరిస్తూ వాట్సాప్ బీటా ఇన్ఫో ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది.స్క్రీన్‌షాట్‌లో మీరు వీడియో కాల్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లో కనిపించడం గమనించవచ్చు.యాపిల్ యాప్ స్టోర్ నుంచి యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా మీ అకౌంట్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు.
కొత్త అప్‌డేట్‌లో డాక్యుమెంట్‌లకు క్యాప్షన్‌లను జోడించగల సామర్థ్యం, లంగర్ గ్రూప్ డిస్క్రిప్షన్ వంటి నయా ఫీచర్లు కూడా ఉన్నాయి.మరికొద్ది వారాల్లో ఈ ఫీచర్లు క్రమంగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.తాజా ఫీచర్‌లను పొందడానికి వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ముఖ్యం.ఇకపోతే ఇతరులతో కమ్యూనికేట్ అయ్యే విధానాన్ని చాలా సులభతరం చేసిన వాట్సాప్ డిజిటల్ పేమెంట్ చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.
ఇంకా అనేక సర్వీసులను తనలో కలుపుకొని చాలా వేగంగా, సులభమైన పద్ధతిలో అందిస్తోంది.చాలా సంస్థలు వాట్సాప్ తోటి కలిసి తమ సేవలను అందజేస్తున్న విషయం తెలిసిందే.