భార్యను నగ్నంగా గ్రామమంతా ఊరేగించిన భర్త.. ఎందుకో తెలుసా..?

ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధాల( Illegal Affairs ) కారణంగా కుటుంబాలు నాశనం అయ్యి రోడ్డున పడుతున్నాయి.మానవత్వం అనేది లేకుండా పోతోంది.

 The Husband Paraded His Wife Naked Throughout The Village In Gujarat Details, Hu-TeluguStop.com

కేవలం కొద్ది నిమిషాల శారీరక సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ఆమె భర్త మే 28 న తన భార్య బట్టలు విప్పేసి నగ్నంగా ఊరంతా ఊరేగించిన ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళితే.గుజరాత్ లోని( Gujarat ) మెష్నా చనాస్మా గ్రామంలో నివాసం ఉండే ఓ మహిళకు వివాహం అయ్యి నలుగురు పిల్లలు సంతానం.అయితే ఈ గిరిజన మహిళ ఏడాదిన్నర క్రితం భర్త, నలుగురు పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది.

ఇక ఆ వ్యక్తితో సహజీవనం చేయడం ప్రారంభించింది.తర్వాత ఆ వ్యక్తితో వివాహం చేసుకుంది.

ఈ విషయం భర్తకు తెలిసి ఆమెపై పగ పెంచుకున్నాడు.

అయితే రెండో భర్త గ్రామమైన రాంపురాలో వారి బంధువుల వివాహం జరుగుతున్న నేపథ్యంలో రెండో భర్త తల్లి మొదటి భర్తను వివాహానికి ఆహ్వానించింది.దీంతో ఆ మొదటి భర్త వివాహానికి హాజరై ఎవరికి తెలియకుండా తన భార్యను కిడ్నాప్( Kidnap Wife ) చేసి తన స్వగ్రామం మర్గాల కు తీసుకువచ్చాడు.ఊర్లో ఉండే గ్రామస్తులంతా చూస్తూ ఉండగా అందరి ముందు తన భార్య బట్టలు విప్పేసి నగ్నంగా ఊరంతా తిప్పుతూ చిత్రహింసలు పెట్టాడు.

గ్రామస్తులంతా ఈ దారుణాన్ని అడ్డుకోకుండా చూస్తూ ఉండడం, కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.చివరికి పోలీసుల దృష్టిలో పడడంతో పోలీసులు నిందితుడితో పాటు అతనికి సహకరించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube