భార్యను నగ్నంగా గ్రామమంతా ఊరేగించిన భర్త.. ఎందుకో తెలుసా..?

ఇటీవలే కాలంలో వివాహేతర సంబంధాల( Illegal Affairs ) కారణంగా కుటుంబాలు నాశనం అయ్యి రోడ్డున పడుతున్నాయి.

మానవత్వం అనేది లేకుండా పోతోంది.కేవలం కొద్ది నిమిషాల శారీరక సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ఆమె భర్త మే 28 న తన భార్య బట్టలు విప్పేసి నగ్నంగా ఊరంతా ఊరేగించిన ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

అయితే ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. """/" / వివరాల్లోకెళితే.

గుజరాత్ లోని( Gujarat ) మెష్నా చనాస్మా గ్రామంలో నివాసం ఉండే ఓ మహిళకు వివాహం అయ్యి నలుగురు పిల్లలు సంతానం.

అయితే ఈ గిరిజన మహిళ ఏడాదిన్నర క్రితం భర్త, నలుగురు పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది.

ఇక ఆ వ్యక్తితో సహజీవనం చేయడం ప్రారంభించింది.తర్వాత ఆ వ్యక్తితో వివాహం చేసుకుంది.

ఈ విషయం భర్తకు తెలిసి ఆమెపై పగ పెంచుకున్నాడు. """/" / అయితే రెండో భర్త గ్రామమైన రాంపురాలో వారి బంధువుల వివాహం జరుగుతున్న నేపథ్యంలో రెండో భర్త తల్లి మొదటి భర్తను వివాహానికి ఆహ్వానించింది.

దీంతో ఆ మొదటి భర్త వివాహానికి హాజరై ఎవరికి తెలియకుండా తన భార్యను కిడ్నాప్( Kidnap Wife ) చేసి తన స్వగ్రామం మర్గాల కు తీసుకువచ్చాడు.

ఊర్లో ఉండే గ్రామస్తులంతా చూస్తూ ఉండగా అందరి ముందు తన భార్య బట్టలు విప్పేసి నగ్నంగా ఊరంతా తిప్పుతూ చిత్రహింసలు పెట్టాడు.

గ్రామస్తులంతా ఈ దారుణాన్ని అడ్డుకోకుండా చూస్తూ ఉండడం, కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

చివరికి పోలీసుల దృష్టిలో పడడంతో పోలీసులు నిందితుడితో పాటు అతనికి సహకరించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.