ఈ పార్కు ఎంత చిన్నదో తెలుసా.. గిన్నిస్ రికార్డు కూడా బద్దలు!!

సాధారణంగా పార్కు అంటే ఎకరాల స్థలాల్లో విస్తరించి ఉంటుంది.కానీ యూఎస్ రాష్ట్రం ఒరెగాన్‌లో అతిపెద్ద నగరమైన పోర్ట్ ల్యాండ్‌లో ఉండే పార్క్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది.

 Guinness Record For Smallest Park In The World Mill Ends Park Details, Mill Ends-TeluguStop.com

ఎంత చిన్నగా అంటే అందులో ఒక్క మనిషి కూడా కూర్చోలేడు.ఈ పార్క్ పేరు ‘మిల్ ఎండ్స్ పార్క్’.

దీనిని 1948లో ఏర్పాటు చేశారు.రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అంటే 1948లో ఈ చిన్న పార్కు ఉనికిలోకి వచ్చింది.

పోర్ట్ ల్యాండ్‌లో డిక్ ఫాగన్ అనే వ్యక్తి ఒరెగాన్ జర్నల్‌కు కాలమిస్ట్‌గా పనిచేసేవాడు.

అతని ఆఫీసు నుంచి చూస్తే రోడ్డు కనిపించేది.

రోడ్డు మధ్యలో పోల్స్ నిర్మించే స్థలం కూడా తనకు కనిపించేది.అయితే తన ఆఫీసుకి చాలా సమీపంలో ఒక పోల్ నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం రోడ్డు మధ్యలో కొంత స్థలాన్ని వదిలేసింది.

ఆ స్థలంలో పోల్ వస్తుందేమో అని డిక్ ఫాగన్ చాలా రోజులు చూస్తూనే ఉన్నాడు కానీ ఎంతకీ ఆ స్థలం ఖాళీగానే వదిలేయడంతో చివరికి దానిని ఒక పార్కుగా తీర్చిదిద్దాదామనుకున్నాడు.

Telugu Guinness, Mill Ends Park, Millends, Portland Park, Smallest Park, Tiny Ur

అనుకున్నదే తడవుగా ఆ చిట్టి ప్లేస్‌లో మొక్కలు నాటి ‘మిల్ ఎండ్స్ పార్క్’ అని దానికి నామకరణం చేశాడు.ఆ తర్వాత కూడా దాని మంచి చెడులు చూసుకుంటూ అందులో కొన్ని పూల మొక్కలను నాటాడు.తాను రచించే కాలమ్స్‌లో ఈ పార్కు గురించి అప్పుడప్పుడు రాస్తుండేవాడు.

దీనిని చదివిన చాలామంది ఈ పార్కును చూసేందుకు అక్కడికి తరలి వచ్చేవారు.అలా అతను బతికున్న రోజుల్లోనే ఈ పార్కు బాగా పాపులర్ అయింది.

కొన్నేళ్ల తర్వాత ఫాగన్ క్యాన్సర్ బారిన పడి 1969లో కన్నుమూశాడు.

Telugu Guinness, Mill Ends Park, Millends, Portland Park, Smallest Park, Tiny Ur

అతను చనిపోయిన తర్వాత కూడా ఆ పార్కును ఎవరూ కూడా తీసేయలేదు.డిక్ ఫాగన్‌కు గుర్తుగా స్థానికులు ఈ పార్కును సంరక్షించారు.అంతేకాదు వారు ఈ పార్కులో సీతాకోక చిలుకల కోసం చిన్న స్విమ్మింగ్ ఫూల్, డైవింగ్ బోర్డ్, ఫాగన్ పనిచేసిన బిల్డింగ్ మినియేచర్ ఏర్పాటు చేశారు.

ఇది 1976లో అధికారిక నగర ఉద్యానవనంగా పేరుపొందింది.ఈ పార్క్ సెయింట్ పాట్రిక్స్ డే ఉత్సవాల ప్రదేశంగా కొనసాగుతుంది.ఈ పార్క్ లో ఉండే ఒక చిన్న చెట్టు ఆకర్షణీయంగా నిలుస్తుంది.ప్రపంచంలో మరెక్కడా ఇంత చిన్న పార్క్ లేదు కాబట్టి ఇది అతిచిన్న పార్కుగా గిన్నిస్ రికార్డుకెక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube