ఈ అలవాట్లు శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి..! అవేంటో తెలుసా..?

శరీరానికి రోగనిరోధక శక్తి( Immunity ) అన్నది చాలా అవసరం.లేదంటే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

 These Habits Make The Body Weak Do You Know That , Tea , Coffee, Immunity, Dis-TeluguStop.com

ఇక కరోనా సమయంలో కూడా ఇది చాలా సార్లు నిరూపమైంది.అయితే నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇమ్యూనిటీ బలంగా ఉండాలని కోరుకుంటున్నారు.

ఇందుకోసం ఎలాంటి డైట్ పాటించాలి అన్నదాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు.కానీ చాలామంది ఇమ్యూనిటీని తగ్గించే విషయాలపై కూడా శ్రద్ధ చూపడం లేదు.

నేటి కాలంలో ప్రజలు శరీరానికి హాని కలిగించే జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.దీని వల్ల రోగ నిరోధక శక్తి కూడా బలహీన పడుతుంది.

అయితే పదేపదే అనారోగ్యానికి గురవుతున్నారు అంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి.

Telugu Alcohol, Coffee, Diseases, Tips, Immunity-Telugu Health

ఇలాంటి సమయంలో ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.అలాగే చక్కెరకు చాలామంది బానిసగా అవుతారు. టీ, కాఫీలు( Tea coffee ) కాకుండా ప్రజలు కూల్ డ్రింక్స్ ద్వారా చక్కెరను అధికంగా తీసుకుంటారు.

దీని వలన శరీరంలో వాపు వచ్చే ప్రమాదం ఉంది.అలాగే ఇది ఊబకాయానికి( obesity ) కూడా దారి తీస్తుంది.ఇక చక్కెరను శుద్ధి చేయడం ద్వారా తయారు చేస్తారు.ఇది ఆరోగ్యానికి చాలా పెద్ద ముప్పు.

ఇక చక్కెర రోగనిరోధక కణాలకు హాని కలిగిస్తుంది.టీ లేదా కాఫీకి చాలామంది అలవాటు పడిపోతారు.

ఇది అనారోగ్యానికి గురిచేస్తుంది.ఎందుకంటే ఇందులో కెఫిన్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.

Telugu Alcohol, Coffee, Diseases, Tips, Immunity-Telugu Health

ఇక ఆల్కహాల్ ( Alcohol )వ్యసనం ప్రాణాంతకం అవుతుంది.ఆల్కహాల్ తో బానిసలైన వారి కాలేయం బలహీన పడుతుంది.అలాగే పొట్ట సంబంధిత సమస్యల వలన కూడా రోగనిరోధక శక్తి పై చెడు ప్రభావం కారణంగా తరచూ అనారోగ్యానికి గురవుతారు.మద్యం లేదా సిగరెట్ అలవాటు ఉంటే వెంటనే వదులుకునే ప్రయత్నం చేయాలి.

ఇక ఈ మధ్యకాలంలో పెద్దలు లేదా పిల్లలు ఇలా చాలామంది బయట దొరికే జంక్ ఫుడ్ ను తినడానికి ఇష్టపడుతున్నారు.అయితే ఆయిల్, స్పైసి ఆహారాలు ఎంత రుచికరంగా ఉన్నప్పటికీ వీటిని తినడం వలన అనారోగ్యానికి గురవుతారు.

దీని వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి రకరకాల వ్యాధులు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube