ఈ సోలార్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు... ఛార్జ్ 70 రోజులు వస్తుంది!

ఈ స్మార్ట్ యుగంలో యువత చాలా స్మార్ట్ గా ముందుకి పోతున్నారు.యువత అభిరుచులకు తగ్గట్టే వివిధ రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మార్కెట్లో ప్రత్యక్షమౌతున్నాయి.

 The Features Of This Solar Smart Watch Can't Be Resisted 70 Days Of Charge , Sol-TeluguStop.com

ప్రస్తుత ట్రెండ్ స్మార్ట్ వాచ్.దీనిని వాడని యువత లేరంటే అతిశయోక్తి లేదేమో.

మరీ ముఖ్యంగా స్మార్ట్ వాచ్ లలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక, హెల్త్ మోనటరింగ్ తో దానిని కొనడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలో పలు దిగ్గజ బ్రాండ్లు కొత్త కొత్త మోడళ్లలో స్మార్ట్ వాచ్ లను మార్కెట్లోకి దించుతున్నాయి.

మన దేశంలో కూడా వీటి వాడకం రానురాను పెరుగుతోంది.

Telugu Smart Watch, Solar Watch, Tech-Latest News - Telugu

ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ బ్రాండ్లు కూడా భారతదేశంపై ఓ కన్నేశాయి.తాజాగా గార్మిన్ అనే సంస్థ భారతదేశంలో కొత్త స్మార్ట్ వాచ్‌ లను ఆవిష్కరించింది.గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్, గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ సోలార్ అనే పేర్లతో 2 మోడళ్లు మార్కెట్లోకి విడుదల చేసింది.

వీటి ఫీచర్లు చూస్తే మీకు దిమ్మతిరిగిపోవడం ఖాయం.వీటిలో GPS మల్టీస్పోర్ట్ ఫీచర్ ఒకటి ఉంది.గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్, ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ సోలార్ మధ్య ఉన్న తేడా ఒక్కటే, అదే బ్యాటరీ లైఫ్‌.రెండో మోడల్ సోలార్ పవర్ ను వినియోగించుకొని బ్యాటరీ చార్జ్ చేసుకోగలుగుతుంది.

Telugu Smart Watch, Solar Watch, Tech-Latest News - Telugu

ఇండియాలో జనవరి 20 నుంచి అందుబాటులోకి ఈ మోడల్స్ వచ్చాయి.ఈ కామర్స్ వెబ్ సైట్స్ అయినటువంటి టాటా క్లిక్, అమోజాన్, టాటా లగ్జరీ, ఫ్లిప్ కార్ట్, సినర్జైజర్, నైకా డాట్ కామ్ వంటి వాటిలో మీకు ఇవి అందుబాటులో వున్నాయి.ఇక ధర విషయానికొస్తే గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ ధర రూ.55,990 కాగా, గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ సోలార్ ధర రూ.61,990గా మాత్రమే అని కంపెనీ ప్రకటించింది.సాహస యాత్రికులు ఎక్కువగా వినియోగించే ఈ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్ స్మార్ట్ వాచ్ లో స్లీప్ స్కోర్, అడ్వాన్స్‌డ్ స్లీప్ మానిటరింగ్, హెల్త్ మానిటరింగ్ యాక్టివిటీలతో సహా గార్మిన్ పూర్తి వెల్‌నెస్ ఫీచర్‌లు ఉంటాయి.

ఇంకా పూర్తి వివరాలకు సదరు సైట్స్ సందర్శించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube