వైరల్ : పాపం, తండ్రి చేసిన తప్పుకి బలైన కూతురు.. వైరల్ వీడియో!

ప్రమాదం ఎప్పుడు ఎక్కడినుండి వస్తుందో మనం ఊహించలేము.అందుకే మనము ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి.

 The Daughter Who Fell Victim To The Father S Mistake Viral Video , Viral Latest,-TeluguStop.com

లేదంటే ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న జీవితంలో మృత్యువు కారణంగా విషాదపు ఛాయలు అలముకుంటాయి.అయితే ఈ ప్రమాదాలు అనేవి అభం శుభం తెలియని చిన్నారులు విషయంలో జరిగితే ఆ బాధ వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి.అవును… విధి కొన్ని సార్లు ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటుంది.ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోతుంది అని చెప్పాలి.

ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన ఒకటి జరిగింది.

ఇక్కడ తండ్రి చేసిన చిన్న నిర్లక్ష్యం వలన ఏకంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు బలైంది.

ఐస్ క్రీమ్ కావాలనే ఆత్రుత ఆ చిన్నారిని బలిగొంది.అప్పటి వరకు తండ్రితోనే ఎంతో హాయిగా కలిసి నవ్వుతూ కనిపించిన ఆ చిన్నారి కేవలం నిమిషాల వ్యవధిలోనే విగతజీవిగా మారిపోయింది.

ఐస్ క్రీమ్ కావాలి అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లిన చిన్నారికి కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయింది.ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, గ్రీష్మ అనే నాలుగేళ్ల చిన్నారి తన తండ్రి విశాల్ కులకర్ణితో కలిసి ఐస్క్రీమ్ కొనుక్కునేందుకు ఇంటి పక్కనే ఉన్న షాప్ కి వెళ్ళింది.అయితే ఇక షాప్ బయట ఉంచిన ఫ్రిజ్ చూడగానే అననంతో తండ్రిని వదిలేసి దాని దగ్గరకు వెళ్ళింది ఆ చిన్నారి.

అయితే సదరు ఫ్రిడ్జ్ సరిగా లేదేమో, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి, ఆ పాప కుప్పకూలిపోయింది.ఆ సమయంలో తండ్రి కూతుర్ని గమనించకుండా ఫోన్ లో మాట్లాడుతూ ఉండటం గమనార్హం.

కాసేపటి తర్వాత చూస్తే ఫ్రిజ్ పక్కన స్పృహతప్పి పడిపోయింది చిన్నారి.వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందిందని తెలిపారు.

కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube