వైరల్ వీడియో: గాలి పటంతో సహా 30 అడుగుల ఎత్తుకి ఎగిరిన పిల్లోడు.. చివరకు..?

మనలో చాలా మందికి గాలిపటాలు ఎగరేయాలంటే మహా సరదా.అయితే ఇలా గాలిపటాలు ఎగరవేయడం ద్వారా ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి చాలా మందికి తెలియదు.

 The Child Who Flew To A Height Of 30 Feet Including The Wind Map Finally, Kite,-TeluguStop.com

అసలు గాలిపటాలు ఎగురవేయడం ఏంటి.? ప్రాణాలు కోల్పోవడం ఏంటి.? అని చాలామంది అనుకుంటారు.కాకపోతే, గాలిపటాలు ఎగురవేస్తున్న సమయంలో గాలిపటం యొక్క తీగలు విద్యుత్ తీగలకు తగిలి ఎందరో మరణించారు.

అంతేకాదు తీగలకు తగిన గాలిపటాన్ని తీసుకోవడానికి ప్రయత్నించి కూడా ఎంతోమంది భవనాల పై నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన ఓ బాలుడు గాలిపటంతో సహా గాల్లోకి 30 అడుగుల మేర ఎగిరిపోయాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

ఇండోనేషియా దేశంలో ఓ 12 సంవత్సరాలు కలిగిన పిల్లాడికి ఎదురైన చేదు అనుభవం ఇది.వారి ఇంటి వద్ద ఓ భారీ గాలిపటాన్ని ఎగరవేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.గాలిలోకి ఎగరడానికి ప్రయత్నిస్తున్న గాలిపటాన్ని పట్టుకున్న 12 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా అంత పెద్ద గాలి పటాన్ని పట్టుకోవడం అదుపు తప్పడంతో ఏకంగా గాల్లోకి గాలిపటం తోపాటు ఆ పిల్లాడు కూడా ఎగురుకుంటూ వెళ్ళాడు.దాదాపు 30 అడుగుల మేర పైకి వెళ్ళిన బాలుడు అమాంతం చేతులు వదిలేయడంతో 30 అడుగుల ఎత్తు నుంచి ఆ అబ్బాయి కిందపడిపోయాడు.

దీంతో అక్కడే ఉన్న స్థానికులు ఆ బాలుడిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు.అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆ బాలుడికి పలుచోట్ల గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు.

ఎక్కువగా భుజం వైపు దెబ్బలు తగిలాయని అయితే అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఆ 12 సంవత్సరాల బాలుడు అలాగే అతని సోదరుడు కలిసి గాలిపటం ఎగిరివేస్తున్న సమయంలో అనుకోకుండా ఈ సంఘటన జరిగినట్లు అక్కడి ప్రత్యక్షసాక్షులు వివరించారు.

బాలుడు చాలా తేలికగా ఉండటంతో గాలిపటం తోపాటు గాల్లోకి ఎగిరి పోయాడని అక్కడ ఉన్నవారు తెలిపారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube