సైదాబి ఘనమైన నిర్ణయం... ప్రతి అమ్మాయికి ఈమె ఆదర్శం  

Telugu Women Against Child Marriages-

గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన ఒక సాదారణ బాలిక సైదాబి.ప్రస్తుతం ఈమె ఇంటర్‌ చదువుతోంది.ఇంటర్‌ పూర్తి అయిన వెంటనే ఆమెకు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు...

Telugu Women Against Child Marriages--Telugu Women Against Child Marriages-

కుటుంబ సభ్యులకు సైదాబిని చదివించాలని ఉన్నా కూడా ఇరుగు పొరుగు వారు, కుల పెద్దలు నిర్ణయించిన ప్రకారం సైదాబికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.సైదాబి సోదరి 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.ఆ సమయంలో ఆమెకు ఏమీ తెలియదు.కాని కుటుంబ సభ్యులు మతాచారాల కోసం ఆమెకు పెళ్లి చేశారు.

పెళ్లి అయిన కొన్నాళ్లకే ప్రెగ్నెసి, ఆ తర్వాత వరుసగా పిల్లలు అవ్వడంతో ఆమె మూడు సంవత్సరాలకే అంటే 17 ఏళ్ల వయసులో చనిపోయింది.

Telugu Women Against Child Marriages--Telugu Women Against Child Marriages-

అక్క మరణంతో సైదాబి మనసులో బలంగా బాల్య వివాహాలపై వ్యతిరేకత ఏర్పడింది.బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుంది.16 ఏళ్ల వయసులోనే బాల్య వివాహాలకు వ్యతిరేక పోరాటం మొదలు పెట్టింది.ప్రస్తుతం ఆమె ఇంటర్‌ చదువుతుంది.

కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.తన అక్క మాదిరిగా తాను కూడా అవ్వ కూడదని ఆమె భావిస్తుంది.కాని కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు ఆమె పెళ్లికి ఒప్పుకోక తప్పడం లేదు.

కాని భవిష్యత్తు తరాలకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆమె కోరుకుంటుంది.

ఈ సంవత్సరం సైదాబి సార్వత్రిక ఎన్నికల్లో తన మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకోబోతుంది.ఆమె బాలయ్య వివాహాలను అడ్డుకున్న వారికి, అరికట్టే వారికి మాత్రమే ఓటు వేస్తాను అంటూ చెబుతోంది.ఆమె తన తోటి వారిని అంటే మొదటి సారి ఓటు వేయబోతున్న వారిని కోరుతున్న విషయం ఏంటీ అంటే అమ్మాయిల జీవితాలను నాశనం చేసే బాల్య వివాహాలను అరికట్టే ప్రభుత్వాలను ఎన్ను కోవాలని మార్పు మనతోనే మొదలు అవ్వాలంటూ పిలుపును ఇస్తుంది.

మరే అమ్మాయి కూడా తన అక్క మాదిరిగా చనిపోకూడదు అంటూ సైదాబి చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం.18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే పెళ్లి చేయాలనే చట్టాలు ఉన్నా కూడా ఇండియాలో అవి అమలు కావడం లేదు.అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయి.ముఖ్యంగా ముస్లీం మతాల్లో బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయి.సైదాబి దారిలో ప్రతి ఒక్కరు అమ్మాయి ధైర్యంగా ముందుకు నడవాలి.

బాల్య వివాహాలపై ఉద్యమంలో పాల్గొనాలి.