తెలుగు నట దిగ్గజం, దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ బాలయ్య టైటిల్ రోల్ పోషిస్తున్న క్రిష్ దర్శకత్వంలో బయోపిక్ ఎన్టీఆర్.రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో మొదటి భాగం కథానాయకుడు ఎప్పటికీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే సినిమా ఆశించిన స్థాయిలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.మొదటి భాగంలో ఎన్టీఆర్ నట జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన క్రిస్ రెండో భాగం మహా నాయకుడు లో ఆయన రాజకీయ ప్రస్థానం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన మహానాయకుడు ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు రెడీ అయిపోయారు.మధు భాగం కథానాయకుడు డిజాస్టర్ కావడంతో ఈ సినిమాపై కొంత నిరాసక్తత ఉన్న ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ఇందులో చూపించడంతో క్రిష్ ఈ మహా నాయకులు ఏం చూపించబోతున్నాడు అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఈ మహా నాయకుడు ఎన్టీఆర్ జీవితంలో విషాదకర రాజకీయ ఘటనలను క్రిష్ చూపించే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టమైపోయింది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మరి ఈ ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ ఎన్టీఆర్ మహానాయకుడు చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపిస్తున్న రానా దగ్గుపాటి నిడివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.