తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించినటువంటి “ఇద్దరమ్మాయిలతో” అనే చిత్రంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ తమిళ హీరోయిన్ “అమలా పాల్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించినటువంటి అమలా పాల్ హీరోయిన్ గా మాత్రం ఎందుకో ఎక్కువ కాలం నిలదొక్కు లేకపోయింది.
కానీ ఈ అమ్మడు తెలుగులో నటించింది కొన్ని చిత్రాలే అయినప్పటికీ తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను బాగానే అలరించింది.
అయితే తాజాగా అమలా పాల్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఇంతకీ ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు అమలా పాల్ పాఠశాలలో చదువుకునే రోజుల్లో యూనిఫారమ్ దుస్తులు ధరించి తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో కొందరు అభిమానులు అమలా పాల్ స్కూల్ యూనిఫారమ్ దుస్తుల్లో చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొంత మంది అమలా పాల్ అభిమానులు ఈ ఫోటోని తమ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే ట్రెండింగ్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అమలా పాల్ బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన “లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్” తెలుగు రీమేక్ లో నటిస్తోంది.అలాగే ప్రముఖ తమిళ దర్శకుడు వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. దీంతో తాజాగా “కద్వీర్” అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.