తెలుగు ఇండస్ట్రీ ఆ ఇద్దరు హీరోయిన్స్ ని ఎందుకు పెట్టుకోలేక పోతున్నారు

సాధారణంగా ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటే చాలా లో బడ్జెట్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి లేదంటే 100 కోట్ల పైగా మార్కెట్ ఉన్న హీరోలతో పెద్ద సినిమాలు తీస్తున్నారు మన మేకర్స్ మీడియం బడ్జెట్ సినిమాలు చాలా తక్కువగానే వస్తున్నాయి.ఇది ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పోకడ.

 Telugu Industry Not Afford These Heroines ,remuneration, Heroines, Telugu Indust-TeluguStop.com

అయితే మన ఇండస్ట్రీలోకి ఒక హీరోయిన్ ని తీసుకోవాలంటే సాధారణ రెమ్యునరేషన్( Remuneration ) అయితే చిన్న హీరోయిన్స్ కి కోటి రూపాయల లోపు, పెద్ద హీరోయిన్స్ కి రెండు కోట్లు నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుంది.ఎంత పెద్ద సినిమా అయినా అంతకుమించి రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది మన ఇండస్ట్రీ వారికి అఫర్డబుల్ కాదు.

Telugu Crore Rupees, Nayanathara, Nayanthara, Telugu, Tollywood, Trisha-Telugu T

అయితే ఇలాంటి పరిస్థితులలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇద్దరు హీరోయిన్స్ ని తమ సినిమాల్లో పెట్టుకోలేక పోతుంది ఎందుకంటే వారి రెమ్యునరేషన్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి.ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు ? వారు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఈ లిస్టులో మొదటగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ నయనతార( Nayanthara ).గతంలో ఆమె లక్ష్మి, శ్రీరామరాజ్యం, ఆంజనేయులు, గాడ్ ఫాదర్ వంటి కొన్ని తెలుగు సినిమాల్లో నేరుగా నటించింది అవి కాకుండా అనేక డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెరుస్తూనే ఉంది.అయితే ఆమెను ఇప్పుడున్న పరిస్థితులలో హీరోయిన్గా తీసుకోవాలంటే ప్రొడ్యూసర్స్ ఏకంగా 10 కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తోంది.అందుకే ఆమెను తీసుకోవడానికి తెలుగు నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.

Telugu Crore Rupees, Nayanathara, Nayanthara, Telugu, Tollywood, Trisha-Telugu T

ఇక ఇదే దోవలో త్రిష( Trisha ) కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారంగానే మారింది ఆమెను కూడా నేరుగా తెలుగు సినిమాల్లో నటింప చేయడానికి ఇప్పుడున్న సినిమా మేకర్స్ రెడీగా లేరు ఎందుకంటే ఈమె కూడా దాదాపుగా నయనతారతో సమానంగా 10 కోట్ల రూపాయలను పారితోషకంగా ఆశిస్తోంది అందువల్లే ఆమెను తెలుగు మేకర్స్ పక్కన పెట్టేశారు.ఈ ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే ప్రస్తుతం తెలుగు సినిమా దూరంగా ఉన్నారు.వయసు పైబడుతున్న ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఒక రూపాయి కూడా తగ్గించడం లేదు.వయసు పెరుగుతుంటే ఎవరికైనా అందం తగ్గుతుంది.కానీ అందాన్ని పెంచుకుంటూ సినిమాలను కూడా పెంచుకుంటున్నారు ఈ హీరోయిన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube