ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం( Skill Development Scheme ) లో అరెస్ట్ బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రేమను కురిపిస్తున్నాయి.చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ ను ఖండించడమే కాకుండా, ఆయన విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి .
అంతేకాదు చంద్రబాబుకు మద్దతుగా వైసిపి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ విషయంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు, కాంగ్రెస్ , ఇతర పార్టీలు కూడా చంద్రబాబు సంఘీభావం తెలుపుతున్నాయి .ఇంత ఆకస్మికంగా చంద్రబాబుపై తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రేమ కురిపించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించింది .దీంతో టీడీపీ( TDP ) ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇప్పటికే బహిరంగంగా ఏ పార్టీకి టిడిపి మద్దతు తెలప లేదు. అయితే తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉండడం , గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడం, వారంతా టిడిపికి సానుభూతిపరులుగా ఉండడంతో, అన్ని పార్టీలు టిడిపి ఓటు బ్యాంకును తమ వైపు డైవర్ట్ చేసుకునే పనిలో ఉన్నాయి.
మొదట్లో బిఆర్ఎస్( Brs ) , చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై పెద్దగా పట్టించుకోలేదు.పైగా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేపట్టగా, దానిని మంత్రి కేటీఆర్ ( Minister KTR )తో పాటు మరి కొంతమంది నేతలు తప్పు పట్టారు.ఎక్కడో ఏపీలో జరిగిన రాజకీయాలకు ఇక్కడ ముడి పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు .ముఖ్యంగా ఐటి ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేయడం వంటివి బీఆర్ఎస్ కు ఇప్పుడు ఇబ్బందిపరంగా మారాయి. దీంతో ఆ తప్పును సరి చేసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టు ను ఖండిస్తూ వైసిపి పై విమర్శలు చేస్తున్నారు .
ఇక కాంగ్రెస్ కూడా చంద్రబాబు కు బెయిల్ లభించడం పై హర్షం వ్యక్తం చేస్తూ ఈ అరెస్టుకు కారణమైన వైసీపీ( YCP ) ప్రభుత్వం పైన, జగన్ పైన విమర్శలు చేస్తున్నారు .అలాగే ఆ పార్టీకి చెందిన కీలక నేత చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. టిడిపి ఓటు బ్యాంకు ను కాంగ్రెస్ వైపు మళ్ళించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దీంతో టీడీపీ ఓటు బ్యాంకు ఏ పార్టీకి డ్రైవర్ట్ అవుతుందనేది అన్ని పార్టీలకు టెన్షన్ కలిగిస్తోంది.