చంద్రబాబు పై తెలంగాణ పార్టీల ఆకస్మిక ప్రేమ ? కారణం ఏంటో ? 

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం( Skill Development Scheme ) లో అరెస్ట్ బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రేమను కురిపిస్తున్నాయి.

చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ ను ఖండించడమే కాకుండా, ఆయన విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి .

అంతేకాదు చంద్రబాబుకు మద్దతుగా వైసిపి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ విషయంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు,  కాంగ్రెస్ , ఇతర పార్టీలు కూడా చంద్రబాబు సంఘీభావం తెలుపుతున్నాయి .

ఇంత ఆకస్మికంగా చంద్రబాబుపై తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రేమ కురిపించడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

  మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించింది .

దీంతో టీడీపీ( TDP ) ఓటు బ్యాంకును  తమ వైపుకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే బహిరంగంగా ఏ పార్టీకి టిడిపి మద్దతు తెలప లేదు.  అయితే తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గంలో టిడిపి బలంగా ఉండడం , గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడం,  వారంతా టిడిపికి సానుభూతిపరులుగా ఉండడంతో,  అన్ని పార్టీలు టిడిపి ఓటు బ్యాంకును తమ వైపు డైవర్ట్ చేసుకునే పనిలో ఉన్నాయి.

"""/" / మొదట్లో బిఆర్ఎస్( Brs ) , చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై పెద్దగా పట్టించుకోలేదు.

పైగా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేపట్టగా,  దానిని మంత్రి కేటీఆర్ ( Minister KTR )తో పాటు మరి కొంతమంది నేతలు తప్పు పట్టారు.

ఎక్కడో ఏపీలో జరిగిన రాజకీయాలకు ఇక్కడ ముడి పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు .

ముఖ్యంగా ఐటి ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేయడం వంటివి బీఆర్ఎస్ కు ఇప్పుడు ఇబ్బందిపరంగా మారాయి.

  దీంతో ఆ తప్పును సరి చేసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టు ను ఖండిస్తూ వైసిపి పై విమర్శలు చేస్తున్నారు .

"""/" / ఇక కాంగ్రెస్ కూడా చంద్రబాబు కు బెయిల్ లభించడం పై హర్షం వ్యక్తం చేస్తూ ఈ అరెస్టుకు కారణమైన వైసీపీ( YCP ) ప్రభుత్వం పైన,  జగన్ పైన విమర్శలు చేస్తున్నారు .

అలాగే ఆ పార్టీకి చెందిన కీలక నేత చంద్రబాబు అరెస్టుపై స్పందించారు.  టిడిపి ఓటు బ్యాంకు ను కాంగ్రెస్ వైపు మళ్ళించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

  దీంతో టీడీపీ ఓటు బ్యాంకు ఏ పార్టీకి డ్రైవర్ట్ అవుతుందనేది అన్ని పార్టీలకు టెన్షన్ కలిగిస్తోంది.

జక్కన్న మహేష్ కాంబోకు భారీ షాక్.. ఆ వ్యక్తి ఈ సినిమా నుంచి తప్పుకున్నారా?