మైనార్టీ డిక్లరేషన్ విడుదల చేసిన తెలంగాణ కాంగ్రెస్..!!

హైదరాబాద్ సిటీ కన్వెన్షన్ లో తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్( Minority Declaration ) విడుదల చేయడం జరిగింది.

CWC సభ్యులు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఇమ్రాన్ ప్రతాప్, నాజీర్ హుస్సేన్ చేతుల మీదుగా డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి వచ్చిన వెంటనే మైనారిటీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.ఉర్దూ మీడియం టీచర్ల కోసం ప్రత్యేకంగా డీఎస్సీ నిర్వహిస్తామని ముస్లిం క్రిస్టియన్స్ స్మశాన వాటికల కోసం భూమి కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

అంతేకాదు కొత్తగా పెళ్లయిన మైనారిటీలకు చెందిన జంటలకు ₹1,60,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

వక్ఫ్ భూములను డిజిటలైజ్ చేస్తామని మైనారిటీల ఇళ్ళ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సాయంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను( Subsidy Loans ) అందించడానికి సంవత్సరానికి ₹1000 కోట్ల కేటాయిస్తామని తెలిపారు.పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు లక్ష రూపాయలు, గ్రాడ్యుయేషన్ కు పాతికవేలు, ఇంటర్మీడియట్ కు 15000/- పదవ తరగతికి పదివేల రూపాయల సాయం నిరుద్యోగ భృతి కింద అందిస్తామని.

Advertisement

తెలపడం జరిగింది.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.గతంలో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు.

మైనారిటీ సోదరులు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని రేవంత్ రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు