తెలంగాణ బిజెపి సీనియర్లు చాలా నిరాశలోనే ఉన్నారు.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana Assembly Elections ) పోటీ చేసిన సీనియర్ నాయకులంతా ఓటమి చెందారు.
ఎంపీలుగా ఉంటూనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ధర్మపురి, బండి సంజయ్ , బాపూరావు వంటి వారు ఓటమి చెందారు.అలాగే తెలంగాణ బిజెపిలో కీలక నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరిగిన ఈటెల రాజేందర్( Etela Rajendar ) సైతం తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలోను ఓటమి చెందారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 111 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు పోటీ చేయగా , కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు విజయం సాధించారు.
ఈటెల రాజేందర్ తనతో పాటు టికెట్లు ఇప్పించుకున్న తన అనుచరులు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక బండి సంజయ్,( Bandi Sanjay ) ధర్మపురి అరవింద్ లు( Dharmapuri Arvind ) ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా ఓటమి చెందారు. కాకపోతే వారు టికెట్లు ఇప్పించుకున్న వాటిలో కొంతమంది ఎమ్మెల్యేగా గెలవడం వారికి కాస్త ఊరట ఇస్తోంది .అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections ) పోటీ చేసి సత్తా చాటుకోవాలనే పట్టుదలతో తెలంగాణ సీనియర్ నాయకులు, కీలక నేతలు ఉన్నారు.నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది .అక్కడ మరో ప్రత్యామ్నాయంగా బలమైన నేత లేకపోవడం ఆయనకు కలిసి వస్తుంది. ఇక కరీంనగర్ నుంచి మళ్లీ బండి సంజయ్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఆయనకు హై కమాండ్ వద్ద పలుకుబడి ఉండడం తో ఆయనకే ఆ సీటు ఖరారు అయ్యే అవకాశం ఉంది .ఇక ప్రస్తుత తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు .ఇక హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ కు పోటీ చేసేందుకు అనువైన నియోజకవర్గం కనిపించడం లేదు.దీంతో ఆయన మెదక్ ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు. కాకపోతే ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.దీంతో తప్పకుండా తనకే అవకాశం ఇస్తారనే అశలతో రాజేందర్ ఉన్నారు.మరి కొంతమంది కీలక నేతలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం తో ఎంపీలుగా పోటీకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారట.