నిన్న నాగార్జున సాగర్ వద్ద యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే.ఇరు రాష్ట్రాల పోలీసులు లాఠీలకు పని చెప్పారు అనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలవరానికి గురి చేసింది.
దాంతో హుటాహుటిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో భేటీ అయ్యారు.సమస్యపై సానుకూల వాతావరణంలో చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా గవర్నర్కు తమ సమస్యలను మరియు కొన్ని ఫిర్యాదు చేయడం జరిగింది.అయితే మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఫలప్రదం అయ్యింది.
ముఖ్యమంత్రుల భేటీ తర్వాత ఇరు రాష్ట్రాల భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, భేటీ వివరాలను తెలియజేశారు.రెండు రాష్ట్రాల మధ్య నీటి ఒప్పందం గురించి చెప్పుకొచ్చారు.
ఇరు రాష్ట్రాల రైతులకు అన్యాయం జరగకుండా, తాగు మరియు సాగు నీటిని సరిగా వాడుకునే దిశగా రెండు ప్రభుత్వాలు అడుగులు వేస్తుందని మంత్రులు చెప్పుకొచ్చారు.ఇకపై సాగర్ ఆనకట్టపైకి ఇరు రాష్ట్రాల పోలీసులు, రైతులు, ప్రజలు వెళ్లకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయి, రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజనీరులు తప్ప మరెవ్వరు కూడా డ్యాం పైకి వెళ్లకూడదని మంత్రులు ఆదేశించారు.
దాంతో నాగార్జున సాగర్ యుద్దం ముగిసినట్లయ్యింది.