చిరంజీవి 150వ సినిమా గురించి ఇటీవల కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మ తెగ ఆసక్తి చూపుతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే పదుల సార్లు చిరు 150వ సినిమా గురించి ట్వీట్లు చేసిన వర్మ తాజాగా మరో సారి ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
కొన్ని రోజులు ముందు చిరంజీవి తన 150వ సినిమాకు తానే దర్శకత్వం వహించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చిన వర్మ తాజాగా చిరు 150వ సినిమాకు దర్శకుడు పూరి కంటే మంచోడు దొరకడు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
తాజాగా ‘టెంపర్’ సినిమా చూసిన సందర్బంగా వర్మ స్పందిస్తూ పూరిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
దర్శకుడిగా పూరి కెరీర్‌లో ఇంత బెస్ట్ సినిమా ఇప్పటి వరకు రాలేదంటూ కూడా వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.ఇంత మంచి దర్శకుడితో చిరంజీవి తన ప్రతిష్టాత్మక 150వ సినిమా చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు.
చిరంజీవి ఇప్పటి వరకు వర్మ చెప్పిన ఏ ఒక్క సలహాను కూడా కనీసం పట్టించుకుని, స్పందించింది లేదు.మరి ఈసారైనా వర్మ ట్వీట్‌పై చిరు స్పందిస్తాడేమో చూడాలి.