మిర్యాలగూడ నుండి సీఎం కృతజ్ఞత సభకు టీచర్లు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని పదోన్నతులు పొందిన సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సీఎం కృతజ్ఞత సభకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల,అడవిదేవులపల్లి,మిర్యాలగూడ రూరల్, టౌన్,వేములపల్లి,మాడుగులపల్లి మండలాల హైస్కూల్,గురుకులాల, ఎల్ఎఫ్ఎల్,పండిట్లుగా పదోన్నతులు పొందిన 303 మంది ఉపాధ్యాయులు సీఎం కృతజ్ఞత సభకు తరలివెళ్లారు.

మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ (రాజీవ్ గాంధీ స్టేడియం)నుంచి ఆరు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పచ్చా జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసుఫ్,మండల విద్యాధికారి మాలోతు బాలాజీ నాయక్, ఎంపీడీవో శేషగిరి శర్మ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్,మంగ్యా నాయక్,కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్,తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, పదోన్నతి పొందిన హైస్కూల్,గురుకులాల పాఠశాలల ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సత్వర వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం : డాక్టర్ సుచరిత

Latest Nalgonda News