గత కొద్ది రోజులుగా ఏపీ లోని రాజకీయ పార్టీల మధ్య ఓట్ల వ్యవహారం పై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు .
వైసీపీ పెద్ద ఎత్తున ఏపీలో దొంగ ఓట్లను నమోదు చేయించిందని టిడిపి విమర్శలు చేస్తుండగా, వైసీపీ సైతం టిడిపి పై అవే విమర్శలు చేస్తుంది.జనసేన సైతం వైసీపీ పై ఇవే విమర్శలు చేస్తోంది.
అయితే ఉద్దేశపూర్వకంగా టిడిపి వైసిపి మద్దతు దారుల ఓట్లను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని , ఎన్నికల కమిషన్ కు వైసిపి నేతలు ఢిల్లీకి వెళ్లి మరి ఫిర్యాదు చేశారు.దీంతో విజయవాడ వేదికగా ఎన్నికల కమిషన్ ముందు వైసీపీ టిడిపిలు ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఫిర్యాదులు చేశారు.
విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను జనసేన, టిడిపి నాయకులు కలిశారు .టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య , బోండా ఉమ, జనసేన నేతలు వెంకటేశ్వర్లు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ , మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి ఏపీలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు.
వైసీపీ నేతలు కూడా ఎన్నికల సంఘం అధికారులను కలిసి టిడిపి జనసేన పై ఫిర్యాదు చేశారు.మంత్రి జోగి రమేష్ , ఎమ్మెల్యే పేర్ని నాని, దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి తదితరులు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.టిడిపి నేతలు రాష్ట్రంలో 40.76 లక్షలకు పైగా దొంగ ఓట్లు జాబితాలో చేర్పించాలని ఫిర్యాదు చేశారు.ఓకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటర్లుగా టిడిపి సానుభూతిపరుల ఓట్లు నమోదు అయ్యాయని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు.
తెలంగాణ , కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టిడిపి సానుభూతిపరుల ఓట్లు రాష్ట్రంలో కూడా నేతలు నమోదు చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే వైసిపి చేస్తున్న ఫిర్యాదులో నిజం ఉందా ? టిడిపి, జనసేన ల ఫిర్యాదులో వాస్తవం ఎంత అనేది ఎన్నికల సంఘం అధికారులు తేల్చాల్సి ఉంది అన్ని పార్టీలు ఓట్ల వ్యవహారం పై ఫిర్యాదు చేయడంతో, ఇందులో ఎవరు దొంగ , అందరూ దొంగలేనా అనే సెటైర్లు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.