దానికి సన్నీ చాలా కష్టపడుతోందట!

పోర్న్‌ స్టార్‌గా కెరీర్‌ను ఆరంభించి, రికార్డు స్థాయిలో పోర్న్‌ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించిన సన్నీలియోన్‌ ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం పోర్న్‌ సినిమాలు మొత్తంగా ఫుల్‌ స్టాప్‌ పెట్టిన సన్నీలియోన్‌ తన దృష్టి అంతా కూడా బాలీవుడ్‌లో పాగా వేయడంపైనే పెట్టింది.

 Sunny Leone Full Effort For Learning Classical Ance-TeluguStop.com

ఐటెం సాంగ్స్‌తో పాటు హీరోయిన్‌గా కూడా పలు సినిమాల్లో నటిస్తూ తనలోని నటనను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది.ప్రస్తుతం ఈమె ‘లీలా’ అనే బాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

‘లీలా’ సినిమా కోసం సన్నీలియోన్‌ పడుతున్న కష్టం చూస్తుంటే ఆ సినిమా యూనిట్‌ సభ్యులకు సైతం ముచ్చటేస్తుందట.ఈ సినిమాలో సన్నీ మూడు పాత్రల్లో కనిపించనుంది.

ఆ మూడు పాత్రల్లో వైవిధ్యభరితంగా కనిపించేందుకు ఈమె తనలో పలు మార్పులు చేసుకుంటుంది.ఇక ఆ మూడు పాత్రల్లో ఒక పాత్ర చాలా సాంప్రదాయబద్దంగా ఉంటుందని చెబుతున్నారు.

ఆ పాత్రతో క్లాసికల్‌ టచ్‌ ఉంటుంది.క్లాసికల్‌ డ్యాన్స్‌ను సన్నీలియోన్‌ అందుకోసం నేర్చుకుంటుంది.

సన్నీలియోన్‌ ఆ డ్యాన్స్‌ను నేర్చుకునేందుకు చాలా కష్టపడుతుందట.ప్రముఖ క్లాసికల్‌ డ్యాన్సర్‌ సరోజా ఖాన్‌ వద్ద ఈమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సన్నీలియోన్‌ ఇంకా ‘లీలా’ సినిమా కోసం ఎంతో కష్టపడుతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.మరి సన్నీలియోన్‌ కష్టానికి ఫలితం ఎలా వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube