మహానటి తర్వాత ఇండస్ట్రీలో బయోపిక్ ఫీవర్ ఇంకా ఎక్కువ అయింది.మహానటికి లభించిన విపరీతమైన ప్రజాధరణతో నటీనటులు కూడా బయోపిక్స్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ దృష్టి అంతా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టియార్ పైనే ఉంది.ఆ చిత్రయూనిట్ కూడా ఈ సినిమాకి సంభందించిన అంశాలు రోజుకొకటి చొప్పున అనౌన్స్ చేస్తూ మరింత ఆసక్తి పెంచుతుంది.
క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే కొన్ని పాత్రలకి కొందరు నటులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.ఎన్టీఆర్.ఈ మూవీలో చంద్రబాబు పాత్రలో రానా నటించనున్నట్లు తాజాగా వెల్లడైంది.ఈ ప్రాజెక్ట్లో హీరో సుమంత్ కూడా చేరినట్లు తెలిపింది చిత్రయూనిట్.బసవతారకంగా విద్యా బాలన్ నటిస్తుండగా.కృష్ణ, శ్రీదేవి తదితర పాత్రల్లో ఎవరు నటించనున్నారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ, కృష్ణగా మహేష్ బాబు, సావిత్రిగా కీర్తి సురేశ్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, రామానాయుడుగా విక్టరీ వెంకటేశ్ కనిపించనున్నట్లు ఫిలింనగర్ టాక్.
అక్కినేని నాగేశ్వరరావు క్యారెక్టర్ లో సుమంత్ నటించనున్నట్లు స్వయంగా సుమంతే ట్విట్ చేశాడు.ఎన్టీఆర్ టీమ్ తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నను అనేది ఆ ట్వీట్ సారాంశం.ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో మా తాతయ్య ANR క్యారెక్టర్ ను పోషిస్తున్నా.
థాంక్స్ అని ట్విట్ చేశాడు సుమంత్ .మొదట్లో ANR క్యారెక్టర్ కోసం నాగచైతన్య పేరు వినిపించినప్పటికీ సుమంత్ ను ఫిక్స్ చేశారు.మహనటి సినిమాలో నాగేశ్వర్రావు పాత్రలో నాగచైతన్య నటించిన విషయం విధితమే.ఏఎన్నార్ పాత్రకి సుమంత్ అయితే బాగుండేదని అప్పుడే టాక్ వినిపించింది.ఇప్పుడు ఈ సినిమాతో సుమంత్ కోరిక,అభిమానుల ఆశ రెండూ నెరవేరుతున్నాయి.
Excited and honored to be joining this team, portraying my grandfather #ANR in this prestigious venture?? #NTR